ఏపీ డిప్యూటీ సీఎం(AP Deputy CM) పవన్ కళ్యాణ్(Pawan Kalyan) ఇటీవల(నవంబర్ 27) కాకినాడ పోర్ట్(Kakinada Port)లో పర్యటించి.. రేషన్ బియ్యాన్ని అక్రమంగా(Illegal ration of rice) తరలిస్తున్న స్టెల్లా షిప్‌ను తనిఖీ చేసి దాన్ని సీజ్ చేయించిన విషయం తెలిసిందే.
అయితే రేషన్ బియ్యాన్ని విదేశాలకు తరలిస్తున్న ఆ షిప్‌ను పోర్టు అధికారులు సీజ్ చేయడంతో రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ నేపథ్యంలో కేంద్రం నుంచి ఎలాంటి సమస్య వచ్చినా తాను చూసుకుంటానని.. ‘సీజ్ ది షిప్’ అంటూ పవన్ కళ్యాణ్ చెప్పుకొచ్చారు. దీంతో ఈ వ్యవహారం మరింత ఉధృతమైంది.
ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తాజాగా కేంద్రం ఊహించని షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. స్టెల్లా షిష్ సీజ్ కుదరదని కేంద్రం తేల్చి చెప్పినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో ప్రభుత్వానికి, కాకినాడ కలెక్టర్‌కి ఎన్సీఎల్ లేఖ రావడంతో.. రేషన్ బియ్యం మినహా మిగిలిన రైస్ ఎగుమతి జరిగే విధంగా చర్యలు తీసుకుంటున్నట్లు సమాచారం.