లక్షలోపు లక్షణమైన స్కూటర్ రిలీజ్ చేసిన బజాజ్.. లుక్ అదిరిపోయిందిగా

భారతదేశంలో ఈవీ స్కూటర్ల హవా రోజురోజుకూ పెరుగుతుంది. పెరుగుతున్న పెట్రోల్ ధరల దెబ్బకు సగటు సామాన్యుడు ఈవీ స్కూటర్లన వాడకానికి మొగ్గు చూపడంతో వాటి డిమాండ్ అమాంతం పెరిగింది. అయితే దేశంలో ఉన్న మధ్యతరగతి ప్రజలను ఆకట్టుకునేలా చాలా కంపెనీలు తక్కువ ధరకే ఈవీ స్కూటర్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ కంపెనీ బజాజ్ తన చేతక్ ఈవీను రూ.లక్ష కంటే తక్కువ ధరకు లాంచ్ చేసింది. ఈ స్కూటర్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

బజాజ్ ఆటో భారతదేశంలో చేతక్ 3001 ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రూ. 99,990 (ఎక్స్-షోరూమ్) ధరతో విడుదల చేసింది. ఈ ఈ-స్కూటర్ చేతక్ 35 సిరీస్‌పై నిర్మించారు.


చేతక్ 3001 సింగిల్ ఛార్జ్‌లో 127 కి.మీ రైడింగ్ రేంజ్, 35-లీటర్ల అండర్-సీట్ స్టోరేజ్‌తో వస్తుంది.

ఈ స్కూటర్ ఫ్లోర్‌బోర్డ్-మౌంటెడ్ 3.0 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ, 750 వాట్స్ ఛార్జర్ ప్రామాణికంగా వస్తుంది. 0 నుంచి 80 శాతం వరకు ఛార్జ్ చేయడానికి దాదాపు నాలుగు గంటలు పడుతుంది.

స్కూటర్ కాల్, మ్యూజిక్ కంట్రోల్స్, హిల్ హోల్డ్, రివర్స్ లైట్, గైడ్-మీ-హోమ్ ల్యాంప్స్ ఉన్న అదే ఇన్స్ట్రుమెంటేషన్‌ను పొందుతుంది. స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ కూడా ఉంది

చేతక్ 3001 బుకింగ్‌లు అన్ని షోరూమ్‌లలో ప్రారంభమయ్యాయి. అలాగే ఈ నెలాఖరు నుండి డెలివరీలు ప్రారంభమయ్యే అవకాశం ఉంది. ఈ ఈ -స్కూటర్‌ను ఎరుపు, నీలం, పసుపు రంగుల్లో అందుబాటులో ఉంటుంది.

 

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.