రూ.99 రీఛార్జ్‌ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్‌.. ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌ పూర్తి వివరాలు..

ప్రభుత్వరంగ టెలికాం సంస్థ BSNL (భారత్‌ సంచార్‌ నిగమ్‌ లిమిటెడ్) ఇటీవలే దేశవ్యాప్తంగా 4G నెట్‌వర్క్‌ను ప్రారంభించింది. ఇందుకోసం 97 వేలకు పైగా టవర్లను ఏర్పాటు చేసింది.


దీంతోపాటు ప్రత్యేక రీఛార్జ్‌ ప్లాన్‌లతో యూజర్లను ఆకట్టుకొనేందుకు ప్రయత్నం చేస్తోంది. స్వాతంత్ర్య దినోత్సవం, దీపావళి సహా ఇతర పండుగల సమయాల్లో ప్రత్యేక ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకొనే ప్రయత్నం చేస్తోంది.

ఇటీవల దీపావళి సందర్భంగా రూ.1 తో నెలరోజుల వ్యాలిడిటీ అందించే ఆఫర్‌ను తీసుకొచ్చింది. రూ.1 రీఛార్జ్ ప్లాన్‌తో అన్‌లిమిటెడ్ కాలింగ్, రోజువారీ 100 SMS లు మరియు ప్రతిరోజు 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ నెలరోజులుగా ఉంది. నవంబర్‌ 15 వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుంది. అయితే కొత్త యూజర్లకు మాత్రమే ఈ ప్లాన్‌ వర్తిస్తుంది.

ప్రస్తుతం బీఎస్‌ఎన్‌ఎల్‌ అనేక రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉన్నాయి. ఇతర టెలికాం సంస్థలతో పోలిస్తే తక్కువ ధరలకు రీఛార్జ్ ప్లాన్‌లను కలిగి ఉంది. రూ.99 ధర నుంచే కాలింగ్ ప్లాన్‌ను అందిస్తోంది. ఇందులో నెలవారీ నుంచి వార్షిక ప్లాన్‌లు కూడా ఉన్నాయి.

రూ.99 రీఛార్జ్ ప్లాన్ :

ఈ ప్లాన్‌లో (BSNL Rs99 recharge Plan) భాగంగా బీఎస్‌ఎన్‌ఎల్‌ యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు 50MB డేటాను అందిస్తోంది. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 15 రోజులుగా ఉంటుంది. ఇంకా ఎటువంటి అదనపు ప్రయోజనాలను అందించడం లేదు.

రూ.107 రీఛార్జ్ ప్లాన్ :

ఈ రీఛార్జ్‌ ప్లాన్‌లో (BSNL Rs107 recharge Plan) భాగంగా యూజర్లు 200 నిమిషాల లోకల్‌, STD కాలింగ్‌ను పొందవచ్చు. మరియు 3GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో ఎటువంటి SMS ప్రయోజనాలను పొందలేరు. ఈ ప్లాన్ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.

రూ.147 రీఛార్జ్‌ ప్లాన్‌ :

ఈ ప్లాన్‌లో (BSNL Rs147 recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు 5GB డేటాను వినియోగించుకోవచ్చు. SMS సహా ఇతర ప్రయోజనాలను అందించడం లేదు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.

రూ.153 రీఛార్జ్ ప్లాన్‌ :

ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్‌ ప్లాన్‌లో (BSNL Rs153 recharge Plan) భాగంగా BSNL యూజర్లు అన్‌లిమిటెడ్‌ వాయిస్‌ కాల్స్‌ను వినియోగించుకోవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను పొందవచ్చు. ఈ ప్లాన్‌లో రోజువారీ 1GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లా్‌న్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంటుంది.

రూ.199 రీఛార్జ్‌ ప్లాన్ :

ఈ ప్లాన్‌లో (BSNL Rs199 recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 100 SMS లను వినియోగించుకోవచ్చు. మరియు రోజువారీ 2GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లా్‌న్‌ వ్యాలిడిటీ 28 రోజులుగా ఉంది.

రూ.198 రీఛార్జ్ ప్లాన్ :

ఈ ప్లాన్‌లో (BSNL Rs198 recharge Plan) భాగంగా BSNL యూజర్లు 40GB డేటాను పొందవచ్చు. అయితే ఎటువంటి కాలింగ్‌, SMS లు సహా ఇతర ప్రయోజనాలను అందుకోలేరు.

రూ.229 రీఛార్జ్‌ ప్లాన్ :

ఈ ప్లాన్‌లో (BSNL Rs229 recharge Plan) భాగంగా యూజర్లు అన్‌లిమిటెడ్‌ కాలింగ్ సదుపాయాన్ని పొందవచ్చు. దీంతోపాటు ప్రతిరోజు 100 SMS లను వినియోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌లో రోజువారీ 2GB డేటాను ఉపయోగించుకోవచ్చు. ఈ ప్లాన్‌ వ్యాలిడిటీ నెలరోజులుగా ఉంటుంది.

రూ.299 రీఛార్జ్ ప్లాన్‌ :

BSNL యూజర్లు ఈ ప్రీపెయిడ్‌ రీఛార్జ్ ప్లాన్‌లో (BSNL Rs299 recharge Plan) అన్‌లిమిటెడ్‌ కాల్స్‌ను ఉపయోగించుకోవచ్చు. మరియు రోజువారీ 100 SMS లను పొందవచ్చు. దీంతోపాటు రోజువారీ 3GB డేటాను వినియోగించుకోవచ్చు. ఈ ప్లా్న్ వ్యాలిడిటీ 30 రోజులుగా ఉంది. అధిక డేటా అవసరాలున్న యూజర్లు ఈ ప్లాన్‌ను ఎంచుకోవచ్చు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.