రూ.1కే రోజు 2 GB డేటా.. అపరిమిత కాల్స్.. గడువు 15 వరకే.. త్వరపడండి

మొబైల్ రీఛార్జ్ ధరలు పెరుగుతున్న క్రమంలో Bharat Sanchar Nigam Limited (BSNL) వినియోగదారులను ఆకర్షించేందుకు అద్భుతమైన ఆఫర్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.


గత నెలలో వచ్చిన స్వాతంత్ర దినోత్సవ సందర్భంగా ‘ఫ్రీడమ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ ఆఫర్ చాలా మందికి నచ్చడంతో కొనుగోలు చేశారు. అయితే ఆగస్టు 15 నుంచి 31 వరకు మాత్రమే ఈ ప్లాన్ గడువు ఉండేది. కానీ గడువు సమీపించిన తర్వాత దీనిపై ఆసక్తి చర్చ జరిగింది. అయితే తాజాగా బిఎస్ఎన్ఎల్ మరోసారి వినియోగదారులకు ఈ ప్లాన్ చేసుకునేందుకు అవకాశం ఇచ్చింది. అంటే ఈ గడువును మరో 15 రోజులు పొడిగించింది. ఇంతకీ ఈ ప్లాన్ వివరాలు ఏంటంటే?

బిఎస్ఎన్ఎల్ ఫ్రీడం ప్లాన్ కు అద్భుతమైన స్పందన లభించింది. ఒకే ఒక్క రూపాయికి ఉచిత సిమ్ ఇవ్వడంతో పాటు.. ప్రతిరోజు 2 GB డేటా తో పాటు ఇతర నెట్వర్క్ లకు అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ అందించారు. దీంతో చాలామంది వినియోగదారులు ఈ సిమ్ ను కొనుగోలు చేశారు. అయితే మరికొంతమందికి ఈ ఆఫర్ తెలుసుకునేసరికి గడువు సమీపించింది. దీంతో వారికోసం మరోసారి గడువును పెంచాలని నిర్ణయించారు. సెప్టెంబర్ 15 వరకు ఈ ఆఫర్ ఉంటుందని బిఎస్ఎన్ఎల్ ప్రకటించింది.

ప్రస్తుతం ఎయిర్టెల్, జియో నెట్వర్కులు పోటాపోటీగా వినియోగదారులను ఆకర్షిస్తూ రీఛార్జ్ ప్లాన్లు కొనసాగిస్తున్నాయి. అయితే ఇటీవలే ఈ రెండు నెట్వర్క్ లు ధరలు పెంచుతున్నట్లు ప్రకటించాయి. ఇలాంటి సమయంలో వినియోగదారులను ఆకర్షించడానికి బిఎస్ఎన్ఎల్ తీసుకువచ్చిన ఈ ప్లాన్ వర్కౌట్ అయింది. అయితే కొన్ని నెలల నుంచి బిఎస్ఎన్ఎల్ వినియోగదాలను ఆకర్షించడానికి 3జి నుంచి 4g, 5 g నెట్వర్కు ను అందుబాటులోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు కొనసాగిస్తుంది. ప్రస్తుతం 4 g నెట్వర్క్ తో ఫ్రీడం ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత 5 g ని కూడా అందుబాటులోకి తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తోంది. మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంలో భాగంగా ఈ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చామని బిఎస్ఎన్ఎల్ అధికారులు తెలుపుతున్నారు.

అయితే ప్రస్తుతం ఫ్రీడమ్ ప్లాన్ ఆక్టివేట్ చేసుకోవాలని అనుకునేవారు బిఎస్ఎన్ఎల్ అధికారిక వెబ్సైట్లోకి వెళ్లాలి. సెల్ఫ్ కేర్ అనే పోర్టల్ లోకి వెళ్లి అక్కడ ఫ్రీడమ్ ప్లాన్ ను ఎంచుకోవాలి. దీంతో వెంటనే ఫ్రీడమ్ ప్లాన్ ఆక్టివేట్ అవుతుంది. మరో వైపు యు ఎస్ ఎస్ డి పద్ధతి ద్వారా కూడా ఈ ప్లాన్ ను రీఛార్జ్ చేసుకోవచ్చు. అయితే ఈ ప్లాన్ ముగిసిన తర్వాత సిమ్ ను అలాగే కొనసాగించుకోవచ్చని ఆ తర్వాత ఇతర ప్లాన్ వేసుకోవచ్చని బిఎస్ఎన్ఎల్ అధికారులు తెలుపుతున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.