అతి తక్కువ ఖర్చులో అధిక డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు కోరుకునే యూజర్లకు ఈ ప్లాన్ గొప్ప వరం అవుతుంది. అయితే, ఈ ప్లాన్ కేవలం నెల రోజులు మాత్రమే లభిస్తుంది. ఎందుకంటే, ఈ ప్లాన్ వచ్చే నెల నుంచి అందుబాటులో ఉండదు. ఈ ప్లాన్ క్లోజ్ కావడానికి ముందే ఈ ప్లాన్ లాభాలు అందుకోండి.
BSNL Super Plan: ఏమిటి ఆ ప్లాన్?
బిఎస్ఎన్ఎల్ కొత్తగా ప్రకటించిన రూ. 251 ప్రీపెయిడ్ ప్లాన్ గురించే ఇప్పుడు మనం మాట్లాడుతోంది. ఈ పాన్ చవక రేటుకే అధిక డేటా అందించే జబర్దస్త్ 30 డేస్ ప్రీపెయిడ్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ పూర్తిగా 30 రోజుల వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో రీఛార్జ్ చేసి యూజర్లు అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100SMS బెనిఫిట్స్ అందుకుంటారు.
ఇక ప్రధాన విషయం డేటా గురించి చూస్తే, ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లకు 30 రోజులకు గాను 100GB డేటా లభిస్తుంది. అంతేకాదు, ఈ డేటా ముగిసిన తర్వాత కూడా 40Kbps వేగంతో నెల మొత్తం అన్లిమిటెడ్ డేటా ఆఫర్ చేస్తుంది.
ఇంతటితో ఈ ప్లాన్ తో అందించే అన్ని ప్రయోజనాలు పూర్తి కాలేదు. ఈ ప్లాన్ తో రీఛార్జ్ చేసే యూజర్లు 30 రోజులు BiTV యాక్సెస్ ను ఉచితంగా అందుకుంటారు. ఈ యాక్సెస్ తో OTT లు మరియు టీవీ ఛానల్స్ కూడా ఉచితంగా అందుతాయి. అయితే, ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న బిఎస్ఎన్ఎల్ రూ. 251 జనవరి 31వ తేదీ వరకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. కాబట్టి, ఈ ప్లాన్ డెడ్ లైన్ ముగిసే లోపు ఈ ప్లాన్ లాభాలను అందుకోండి.
BSNL Super Plan: మరో బెస్ట్ ప్లాన్
హెవీ డేటా మరియు అన్లిమిటెడ్ లాభాలు మరింత తక్కువ ధరలో అందించే మరో బిఎస్ఎన్ఎల్ ప్రీపెయిడ్ ప్లాన్ కూడా ఉంది. అదే, బిఎస్ఎన్ఎల్ యొక్క రూ. 225 రూపాయల అన్లిమిటెడ్ ప్రీపెయిడ్ ప్లాన్. ఈ ప్లాన్ కొద అన్లిమిటెడ్ కాలింగ్ మరియు డైలీ 100 SMS ప్రయోజనాలు అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ తో డైలీ 3జీబీ హై స్పీడ్ డేటా కూడా అందిస్తుంది. ఈ ప్రీపెయిడ్ ప్లాన్ ఈ అని బెనిఫిట్స్ కూడా నెల రోజులు అందిస్తుంది.



































