రాజశేఖర్ ఇల్లు రామ్ చరణ్ భార్య ఉపాసన కొనుక్కోవడానికి గల కారణం ఏంటంటే..?

కెరియర్ మొదట్లో చిన్న చిన్న పాత్రలను వేస్తూ హీరోగా ఎదిగిన రాజశేఖర్ చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా తనను తాను ఎలివేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు.


మరి ఇలాంటి సందర్భంలోనే ఇకమీదట ఆయన ఎలాంటి సినిమాలు చేస్తాడు. తద్వారా ఆయనకంటూ ఎలాంటి ఐడెంటిటి క్రియేట్ అవ్వబోతోంది అనేది కూడా తెలియాల్సి ఉంది. మరి ఏది ఏమైనా కూడా ఆయన సినిమాలు ఆయనకు గొప్ప గుర్తింపును సంపాదించి పెట్టాయి. ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పించే సినిమాలను చేయడంలో రాజశేఖర్ అప్పట్లో సూపర్ సక్సెస్ అయ్యాడు. అలాగే పోలీస్ ఆఫీసర్ పాత్రలను కూడా చాలా అలవోకగా చేసి మెప్పించేవాడు. మరి అలాంటి రాజశేఖర్ చాలా సంవత్సరాల పాటు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చెరగని ముద్ర వేశాడు…ఇక ఒకానొక సమయంలో ఆయనకు పూర్తిగా మార్కెట్ కోల్పోవడంతో అతనితో సినిమాలు చేయడానికి ఏ దర్శకుడు కూడా ఆసక్తి చూపించలేదు. దాంతో ఆయన కొంతమంది కొత్త డైరెక్టర్లను ఎంచుకొని తనే స్వయంగా ప్రొడ్యూసర్ గా మారి మహంకాళి, గడ్డం గ్యాంగ్ లాంటి సినిమాలను చేశాడు.

ఆ సినిమాలు సైతం ప్రేక్షకులను మెప్పించలేకపోయాయి. దాంతో అప్పులు పెరిగిపోవడంతో ఆయన తను ఉంటున్న ఇల్లును సైతం అమ్మేసి తన అప్పులను తీర్చుకున్నాడు. నిజానికి 100 కోట్ల అప్పులు ఉన్న రాజశేఖర్ 200 కోట్లు ఉన్న తన ఇల్లును అమ్మేశాడు. ఇక ఆ ఇల్లును చిరంజీవి కోడలు రామ్ చరణ్ భార్య అయిన ఉపాసన కొనుక్కుంది.

ఇక ఆ విషయంలో కూడా రాజశేఖర్ కొంతవరకు అప్సెట్ అయ్యాడు. చిరంజీవి కావాలనే ఉపాసన చేత తన ఇల్లును కొనిపించాడని కొన్ని కామెంట్లు అయితే చేసినట్టుగా అప్పట్లో వార్తలు వచ్చాయి. మరి ఏది ఏమైనా కూడా జగపతిబాబు, శ్రీకాంత్ లాంటి నటులు ఇప్పటికి ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా రాణిస్తుంటే రాజశేఖర్ మాత్రం ఎందుకని సినిమాల్లో పెద్దగా క్లిక్ అవ్వలేకపోతున్నాడు అనేదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

మరి ఇప్పటికైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి సినిమాలను చేసి మరోసారి సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులందరిలో గొప్ప నటుడిగా తనను తాను ప్రూవ్ చేసుకుంటాడా లేదా అనేది కూడా తెలియాల్సి ఉంది…ఇక ఆయన ఇప్పటికైనా మంచి డైరెక్టర్స్ తో సినిమాలు చేసి మెప్పిస్తేనే తనకి మళ్లీ సినిమాల్లో మంచి అవకాశాలు వస్తాయి….

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.