Uric Acid: యూరిక్ యాసిడ్‌తో చాలా డేంజర్.. ముల్లంగితో కంట్రోల్ చేయవచ్చు.

ప్రస్తుత కాలంలో ఎంతో మంది యూరిక్ యాసిడ్‌తో ఇబ్బంది పడుతున్నారు. యూరిక్ యాసిడ్ కారణంగా శరీరంలో కీళ్ల నొప్పులు అనేవి ఎక్కువగా వస్తుంది. ఇది శరీరంలో ఉత్పత్తి అయ్యే ఒక వ్యర్థ పదార్థం.


బయటకు వెళ్లకుండా శరీరంలోనే ఉండిపోతే.. అనేక సమస్యలకు దారి తీస్తుంది. కాబట్టి దీన్ని తగ్గించుకోవాలి.

ప్యూరిన్ ఉండే ఆహారాలు ఎక్కువగా తినడం వల్ల యూరిక్ యాసిడ్ అనేది పెరుగుతుంది. సాధారణంగా ఇది మూత్రం ద్వారా వెళ్లిపోతుంది. అలా వెళ్లకుండా శరీరంలోనే ఉంటే.. అనేక సమస్యలు వస్తాయి. కీళ్లలో నొప్పి, వాపు వంటి సమస్యలు వస్తాయి.

తీసుకునే ఆహారాలతోనే యూరిక్ యాసిడ్‌ని సులభంగా తగ్గించుకోవచ్చు. అందులోనూ చలికాలంలో కీళ్ల నొప్పులు మరింత ఎక్కువ అవుతాయి. వీటిల్లో ముల్లంగి కూడా ఒకటి. రాడిష్ తినడం ద్వారా యూరిక్ యాసిడ్‌ని సహజంగా తగ్గించవచ్చు.

యూరిక్ యాసిడ్‌ని తగ్గించడంలో ముల్లంగి చక్కగా పని చేస్తుంది. ముల్లంగితో చేసిన ఆహారాలు, ముల్లంగి రసం తీసుకున్నా.. యూరిక్ యాసిడ్ సహజంగా తగ్గిపోతుంది.

ముల్లంగిలో విటమిన్ సి, ఫ్లేవనాయిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. అలాగే ఇందులో 90 శాతం నీరు ఉంటాయి. ఇవి యూరిక్ యాసిడ్‌ని మూత్రం ద్వారా బయటకు పంపుతాయి.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)