Uric Acid: రక్తంలో.. యూరిక్ యాసిడ్ చేరిందా… ఈ జ్యూస్‌లతో తగ్గించుకోవచ్చు!

శరీరంలో యూరిక్ యాసిడ్ పెరిగినప్పుడు రోగనిరోధక వ్యవస్థ సరిగా పనిచేయదు. దీంతో రకరకాల సమస్యలు మొదలవుతాయి. యూరిక్ యాసిడ్ స్ఫటికాలుగా మారి వేళ్ల కీళ్లలో ఇరుక్కుపోయి తీవ్రమైన నొప్పిని కలిగిస్తాయి.


అంతేకాకుండా దీని వల్ల అనేక ఇతర సమస్యలు తలెత్తుతాయి. ఇలాంటి పరిస్థితుల్లో శరీరం నుంచి యూరిక్ యాసిడ్‌ను తొలగించడానికి కొన్ని ఆహార అలవాట్లు మార్చుకుంటే ఈ సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు. యూరిక్ యాసిడ్‌ లక్షణాలు మరియు తగ్గించగల ప్రభావవంతమైన హోమ్‌ రెమెడీస్‌ ఇవే..

యూరిక్​ యాసిడ్​ లక్షణాలు

ఈ రోజుల్లో ఎవరిని కదిలించిన .. షుగర్, బీపీ, కిడ్నీలో రాళ్లు, యూరిక్ యసిడ్ ఎక్కువైందని.. ఇలా ప్రధానమైన ఆరోగ్య సమస్యల గురించి ప్రస్తావిస్తున్నారు. అయితే వీటిలో యూరిక్ యాసిడ్ అనేది ప్రమాదకరమైనది. యూరిక్ యాసిడ్ అనేది ప్యూరిన్లు విచ్ఛిన్నమైనప్పుడు శరీరంలో ఉత్పత్తి అయ్యే రసాయనం. అంటే, ప్యూరిన్లు కొన్ని ఆహారాలలో అధిక మొత్తంలో కనిపించే సమ్మేళనాలు. అవి శరీరంలో విచ్ఛిన్నమవుతాయి . మూత్రపిండాలు యూరిక్ యాసిడ్‌ను ఫిల్టర్ చేస్తాయి. పెరిగిన యూరిక్ యాసిడ్ కారణం తరచుగా మూత్రపిండాలకు సంబంధించినది. ఎందుకంటే మూత్రపిండాలు శరీరం నుండి తగినంత యూరిక్ యాసిడ్‌ను తొలగించలేకపోతే, దాని స్థాయిలు పెరగడం ప్రారంభిస్తాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల శరీరంలో వాపు, నొప్పి, కీళ్లనొప్పులు వంటి సమస్యలు వస్తాయి.

అయితే యూరిక్ యాసిడ్ అనేది మీ శరీరంలో ఎంత ఉందనే దానిపై ఈ వ్యాధి ఆధారపడి ఉంటుంది. బాడీలో యూరిక్ యాసిడ్ పరిమాణం ఎక్కువగా ఉంటే మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడుతాయి. దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధుల ప్రమాదం పెరుగుతుంది. కొన్ని అధ్యయనాలలో ఇది అధిక రక్తపోటు, హార్ట్‌ ఫెయిల్యూర్‌, మెటబాలిక్ సిండ్రోమ్‌తో ముడిపడి ఉంటుంది.ఒక వ్యక్తికి యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు.. అతనికి మధుమేహం, స్ట్రోక్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. ఇది ప్రాణాంతక వైద్య పరిస్థితి. ఈ ప్రమాదాలను నివారించడానికి అధిక యూరిక్ యాసిడ్ ప్రారంభ లక్షణాలను గుర్తించాలి. వెంటనే దానికి చికిత్స తీసుకోవాలి. యూరిక్ యాసిడ్ సాధారణంగా పురుషులలో 7 మిల్లీగ్రాముల డెసిలీటర్‌కు (mg/dL), మహిళల్లో 6 mg/dL కంటే ఎక్కువగా ఉన్నప్పుడు ఎక్కువగా పరిగణిస్తారు.

యూరిక్ యాసిడ్ ఎక్కువైనప్పుడు వారిలో ఈ లక్షణాలు కనిపిస్తాయి… కాలి బొటనవేలు నొప్పిగా ఉండటం… బొటనవేలు వాపుగా ఉండటం. చీలమండ నుంచి మడమ వరకు నొప్పిగా ఉండటం. పాదం అడుగు భాగంలో తీవ్రమైన నొప్పి రావడం, మోకాలి నొప్పి కూడా రావడం వీటి లక్షణాల్లో ప్రధానమైనవి.

శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగినప్పుడు నొప్పి, కీళ్లలో దృఢత్వం, చర్మం ఎర్రబడడం, మూత్రంలో రక్తం, తరచుగా మూత్రవిసర్జన, జననేంద్రియ ప్రాంతానికి చేరే నడుము నొప్పి, అలసట వంటి లక్షణాలు కనిపిస్తాయి.శరీరంలో యూరిక్ యాసిడ్ మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్లలేని పరిస్థితిలో అధికమవుతుంది. ఒక వ్యక్తి అధికంగా ఆల్కహాల్ తీసుకోవడం, డైయూరిటిక్స్ తీసుకున్నప్పుడు ఇది సాధారణంగా జరుగుతుంది.

కణ విచ్ఛిన్నం అనేది శరీరంలో జరిగే సహజ ప్రక్రియ. కణాలు విచ్ఛిన్నమైనప్పుడు, యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. అంతే కాకుండా మనం తినే ఆహారం నుండి కూడా యూరిక్ యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ పరిమాణం పెరిగితే, ఆర్థరైటిస్ వంటి అనేక ఇతర వ్యాధులకు గురవుతాము.రక్తంలోని యూరిక్ యాసిడ్‌ను .. కాలేయం ఫిల్టర్ చేసి… మూత్రం ద్వారా శరీరం నుంచి తొలగిస్తుంది. శరీరంలో యూరిక్ యాసిడ్ అధికంగా ఉత్పత్తి చేయబడితే, కాలేయం దానిని సరిగ్గా ఫిల్టర్ చేయలేకపోతుంది. రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి గణనీయంగా పెరుగుతుంది. అటువంటి పరిస్థితిలో మనకు హైపర్యూరిసెమియా సమస్య ఉంటుంది.

రక్తంలో యూరిక్ యాసిడ్ స్థాయి పెరిగిపోతే కీళ్ల మధ్య ఘన పదార్థం ఏర్పడి కీళ్లనొప్పుల సమస్య వస్తుందని తెలిపారు. యూరిక్ యాసిడ్ ఎక్కువగా ఉంటే కిడ్నీ స్టోన్ సమస్య రావచ్చు. మూత్ర విసర్జనలో ఇబ్బంది కూడా ఉండవచ్చు. కీళ్ల దగ్గర యూరిక్ యాసిడ్ పేరుకుపోతే అది కీళ్లనొప్పులకు కూడా కారణమవుతుంది.

యూరిక్​ యాసిడ్​ తగ్గేందుకు హో రెమిడీస్​..

వేడినీటిలో నిమ్మరసం: నిమ్మరసం తీసుకోవడం ద్వారా రక్తంలోని యూరిక్ యాసిడ్ మొత్తం తొలగించ వచ్చని వైద్యులు చెబుతున్నారు. ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో రెండు నుండి మూడు చెంచాల నిమ్మరసం మిక్స్ చేసి, ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో త్రాగాలి.

ఆలివ్​ ఆయిల్​: కూరగాయలలో ఇతర నూనెలకు బదులుగా ఆలివ్ నూనెను వాడాలి. ఆలివ్ నూనెలో మోనోశాచురేటెడ్ కొవ్వు ఉంటుంది, ఇది యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గిస్తుంది, ఫైబర్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం ద్వారా యూరిక్ యాసిడ్ సులభంగా మూత్రపిండాల ద్వారా గ్రహించబడుతుంది.

అల్లం టీ : ప్రతిరోజూ అల్లం టీ తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలను తగ్గించుకోవచ్చు. అల్లంలోని క్రిమినాశక, రోగ నిరోధక గుణాలు ఉండటమే కారణంగా చెప్పవచ్చు. అంతేకాకుండా, అల్లంలోని యాంటీఆక్సిడెంట్లు, ఖనిజాలు సహజంగా మంట, కీళ్ల నొప్పులు, శరీర నొప్పిని తగ్గించడంలో సాయపడతాయి.

దోసకాయ రసం : దోసకాయ రసంలో నిమ్మరసం కలిపి తాగడం వల్ల కాలేయం, కిడ్నీలు శుద్ధి అవుతాయి. రక్తప్రవాహంలో యూరిక్ యాసిడ్ స్థాయిని తగ్గిస్తుంది. పొటాషియం, భాస్వరం ఉండటం వల్ల మూత్రపిండాలను క్లీన్ చేయడంలో సాయపడుతుంది. మూత్రపిండాల పనితీరును పెంచడంతో పాటు శరీరం నుంచి వ్యర్థాలను బయటకు పంపడంలో సాయపడుతుంది.

క్యారెట్ రసం : తాజా క్యారెట్ జ్యూస్‌లో ఒక చెంచా నిమ్మరసంతో కలిపి తాగడం వల్ల యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగడాన్ని నియంత్రించవచ్చు. ఎందుకంటే.. క్యారెట్ జ్యూస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్ ఎ, ఫైబర్, బీటా కెరోటిన్, మినరల్స్ ఉన్నాయి. యూరిక్ యాసిడ్ పెరగడం వల్ల కలిగే నష్టాన్ని తగ్గించడంలో సాయపడతాయి. దీనికి నిమ్మరసం కలపడం వల్ల మరింత ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. నిమ్మకాయలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్ సి పుష్కలంగా ఉన్నాయి. సహజంగా రోగనిరోధక శక్తిని, కణాల పునరుత్పత్తిని పెంచడంలో సాయపడుతుంది.

గ్రీన్ టీ : ఈ సాధారణ టీని తాగడం వల్ల మీ రోగనిరోధక శక్తిని పెంచడం మాత్రమే కాదు.. అదే సమయంలో టీలోని యాంటీఆక్సిడెంట్లు, బయోయాక్టివ్ సమ్మేళనాలు కొన్ని రోజుల్లో సహజంగా యూరిక్ యాసిడ్‌ను తగ్గించడంలో సాయపడతాయి.

ఉసిరికాయ: దీనిలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలో ఇన్‌ఫ్లమేటరీని నివారించడమే కాకుండా, ఆక్సీకరణ ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది. ఇది యూరిక్ యాసిడ్ స్థాయిని కూడా తగ్గిస్తుంది. కాబట్టి ప్రతి రోజూ కనీసం ఒక ఉసిరికాయను తినడం అలవాటు చేసుకోవాలి.

కరక్కాయ: ఆయుర్వేదంలో కరక్కాయ (మైరోబాలన్)కు ప్రత్యేక స్థానం ఉంది. ఇందులో నిర్విషీకరణ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని టాక్సిన్స్, యూరిక్ యాసిడ్‌లను సులువుగా బయటకు పంపుతుంది. మైరోబాలన్ తీసుకోవడం జీర్ణక్రియకు కూడా మంచిది. దీని సహాయంతో యూరిక్ యాసిడ్ సమస్య నుంచి తేలికగా బయటపడొచ్చు. అలాగే గట్ సమస్యలు కూడా నయమవుతాయి.

చేపలు: రోజువారీ ఆహారంలో చేపలు తినడం వల్ల యూరిక్‌ యాసిడ్ స్థాయిలు తగ్గించుకోవచ్చు. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు వాపును తగ్గించడంలో సహాయపడతాయి. ఇవి మూత్రపిండాలు సరిగ్గా పనిచేయడానికి కూడా సహాయపడుతుంది. దీని కారణంగా టాక్సిన్స్ తొలగిపోతాయి. ఫలితంగా యూరిక్ యాసిడ్ శరీరం నుంచి సులభంగా బయటికి పోతుంది.

కొత్తిమీర : ఎండిన కొత్తిమీర ఆకులు శరీరం నుంచి యూరిక్ యాసిడ్ స్ఫటికాలను తొలగించడంలో సహాయపడతాయి. కొత్తిమీర ఆకుల్లో యూరిక్ యాసిడ్ ను మూత్రంతో తొలగించే గుణాలు ఉంటాయి. యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగిన వ్యక్తులు కొత్తిమీర టీ లేదా కొత్తిమీర నీటిని తీసుకుంటే మంచిది.