ట్రంప్ మరో పిడుగు.. US Hire Act తెరపైకి.. వణుకుతున్న భారత ఐటీ రంగం.. అసలేంటి ఈ కొత్త బిల్లు ?

మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పలు సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను హడలెత్తిస్తున్నారు. టారిఫ్స్ తో ప్రపంచ దేశాలకు ఆందోళన కలిగించిన ట్రంప్ మరో అలజడికి రెడీ అయ్యారు.


విదేశీ కార్మికులకు అమెరికాలో ఉద్యోగాలు రాకుండా నిరోధించడానికి కొత్త బిల్లును తీసుకువచ్చే ప్రయత్నం ట్రంప్ సర్కారు చేస్తోంది.బవిదేశీ కార్మికులపై అమెరికన్ కంపెనీలు ఆధారపడటాన్ని తగ్గించే బిల్లులను తీసుకురావాలని అమెరికా చట్టసభ సభ్యులు పట్టుబడుతున్నారు. రిపబ్లికన్ పార్టీ సెనేటర్ బెర్నీ మోరెనో ఈ బిల్లును ప్రతిపాదించారు.

ఈ బిల్లు అమెరికా పార్లమెంటులో ఆమోదం పొందితే.. విదేశీ విద్యార్థులు, కార్మికులు అమెరికాలో ఉద్యోగాలు పొందడం చాలా కష్టమవుతుంది. ఈ బిల్లు విదేశీయులకు అమెరికా కలను చిదిమేస్తుంది. ముఖ్యంగా భారత ఐటీ రంగానికి కోలుకోలేని దెబ్బ అవుతుంది. భారత ఐటీ పరిశ్రమను వణికిస్తున్న US Hire Act 2025 అంటే ఏమిటి..దీని వల్ల ఇండియన్ ఐటీ సెక్టార్ ఎందుకు అంతలా భయపడుతోంది. అమెరికాలో భారతీయులు ఇకపై ఉద్యోగాలు చేయడం కలేనా ఇలా.. చాలానే ఆందోళనకర పరిస్థితులు కనిపిస్తున్నాయి.

US Hire Act 2025 అంటే ఏమిటి : దీని పూర్తి పేరు.. హైరింగ్ ఇంటర్నేషనల్ రీలొకేషన్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ (HIRE). ఈ బిల్లు అమెరికా సెనేట్‌లో తాజాగా ప్రవేశపెట్టారు. ట్రంప్ పరిపాలనలో ఉన్న పీటర్ నవారో ఈ బిల్లును పార్లమెంట్ ముందుకు తీసుకువచ్చారు. భారతీయ ఐటీ కంపెనీలు అమెరికాకు ఉద్యోగాల కోసం ఎవరినైనా మన దేశం నుండి పంపిస్తే.. 25 శాతం సుంకాన్ని విధించాలని ఈ బిల్లు ప్రతిపాదిస్తోంది. భారత్ మాత్రమే కాదు. ఏ దేశం నుంచి ఉద్యోగులను పంపినా ఆ కంపెనీలకు ఈ సుంకం వర్తిస్తుంది.

కొత్త ప్రతిపాదిత పన్ను 2025 డిసెంబర్ 31 తర్వాత చేసే చెల్లింపులపై వర్తిస్తుంది. ఈ బిల్లు అమెరికన్లకు బదులుగా విదేశీ కార్మికులకు ఉద్యోగాలు ఇచ్చే అన్ని కంపెనీలపై పన్ను విధిస్తుంది. పన్ను నుండి పొందిన డబ్బు మధ్యతరగతికి సహాయపడే శ్రామిక శక్తి అభివృద్ధి కార్యక్రమానికి నిధులు సమకూర్చడానికి ఉపయోగించబడుతుంది. మరి ఇది చట్టంగా మారుతుందా లేదా అనేది ఇప్పుడు సస్పెన్స్ కర అంశంగా మారింది. నిపుణులు మాత్రం ఈ బిల్లు చట్టంగా మారే అవకాశాలు చాలా కష్టమని చెబుతున్నారు.

ఈ బిల్లు ఇప్పుడు భారతదేశంలో 280 బిలియన్ల డాలర్ల టెక్నాలజీ పరిశ్రమలో తీవ్ర అలజడిని రేపుతోంది. EY ఇండియా గ్లోబల్ బిజినెస్ సర్వీసెస్ & ఆపరేషన్స్ భాగస్వామి అరిందమ్ సేన్ మాట్లాడుతూ.. ఈ బిల్లు ఆమోదం పొందాలంటే ఓటింగ్ అవసరం ఉందని.. ప్రస్తుత పరిస్థితుల్లో దాని ఆమోదం కష్టమేనని వెల్లడించారు.HFS రీసెర్చ్ CEO ఫిల్ ఫెర్ష్ట్ ప్రకారం.. HIRE బిల్లు ఒక అధికారిక ప్రతిపాదన మాత్రమే అయినప్పటికీ ఇది సాంకేతిక రంగానికి మరో అనిశ్చితిని కలిగిస్తోందని తెలిపారు.

టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS), ఇన్ఫోసిస్, HCLTech, విప్రో, టెక్ మహీంద్రా వంటి ఐటీ దిగ్గజాలు తమ ఆదాయంలో 50-65 శాతం ఉత్తర అమెరికా మార్కెట్ నుంచి పొందుతున్నాయి. అమెరికా సుంకాలు, వీసా ఆంక్షలు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, సైలెంట్ నియామకాలు భారతీయ ఐటీ రంగానికి ఇప్పుడు తీవ్ర సంక్షోభాన్ని మిగుల్చుతున్నాయి. ఈ బిల్లు వల్ల అమెరికన్ కంపెనీలు భారతదేశంలో కొత్త ఒప్పందాలు, పెట్టుబడులను ఆలస్యం చేసే అవకాశాలు ఉన్నాయని పరిశీలకులు భావిస్తున్నారు.

అయితే, భారత ప్రభుత్వం, ఐటీ పరిశ్రమ నిపుణులు ఉత్సాహంగా స్పందిస్తూ, దేశీయ ప్రతిభపై పన్ను విధించడం వలన మార్జిన్లు తగ్గిపోవడం, ఒప్పంద చక్రాలు నెమ్మదించడం, సంస్థలు వైవిధ్య భరితంగా మారడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. ప్రపంచ టెక్ దిగ్గజాలు-గూగుల్, ఆపిల్, మెటా, మైక్రోసాఫ్ట్ వంటి సంస్థలు.. ప్రస్తుతం భారతదేశంలో పెట్టుబడులను పెంచుతున్నాయి.

గత సంవత్సరంలో 30 వేల మందికి పైగా ఉద్యోగులను నియమించుకున్నాయి. AI భాగస్వామ్యాలు, ప్రధాన కార్యాలయ లీజులు వంటి చర్యల ద్వారా భారతదేశాన్ని తమ వ్యూహాల్లో కీలక భాగంగా భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ బిల్లు ఆమోదం పొందితే అన్ని కంపెనీలు భారత్ కు తరలివస్తాయని నిపుణులు చెబుతున్నారు. భారతీయ ఐటీ పరిశ్రమను భవిష్యత్తులో నిలబెట్టేందుకు మరింత స్థిరమైన, ప్రోత్సాహకరమైన విధానాలు అవసరమని వారు సూచిస్తున్నారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.