అమెరికా అధ్యక్షుడిగా వైట్‌హౌస్ లోకి అడుగుపెట్టిన డొనాల్డ్ ట్రంప్ సంచలన నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలోనే సోమవారం ట్రంప్ మరో సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవాలని నిర్ణయించారని తెలుస్తోంది. ఇది కోట్ల మంది అమెరికన్లు హర్షించే నిర్ణయం కానుందని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే ప్రెసిడెండ్ డొనాల్డ్ ట్రంప్ అమెరికా సిటిజన్లకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని చూస్తున్నారని వెల్లడైంది. దీని ద్వారా అమెరికా ప్రజలతో పాటు వారి కుటుంబాల్లో ఖర్చు చేయదగిన ఆదాయాన్ని పెంచే క్రమంలో ఈ ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. ఈ అంశంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో మాదిరిగానే శక్తివంతమైన, ధనికదేశంగా మార్చిన విధానానికి తిరిగి యునైటెడ్ స్టేట్స్ తిరిగి వెళ్లాల్సిన సమయం మళ్లీ వచ్చేసిందని ట్రంప్ వ్యాఖ్యానించారు.
ఈ క్రమంలో ట్రంప్ ప్రధానంగా అమెరికన్లపై పన్నులు విధించటం కంటే దిగుమతులపై పన్నులను పెంచే ఉద్ధేశంలో ఉన్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన ఇటీవల మాట్లాడుతూ అమెరికా కోసం ఉత్పత్తి చేయాలనుకునేవారికి తమ ప్రభుత్వం తోడుటుందని, భూమిమీద అత్యల్ప పన్నులను అందిస్తామని మాట ఇచ్చారు. అలా కాని పక్షంలో దిగుమతులపై అధిక పన్నుల ద్వారా అమెరికా ట్రెజరీకి భారీ మూల్యం చెల్లించుకోవాల్సిందేనని వ్యాపార సంస్థలకు ట్రంప్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన సంగతి తెలిసిందే.
ట్రంప్ తాజా నిర్ణయం ద్వారా అమెరికా ఫ్రెడరల్ రిజర్వుకు ఆదాయపు పన్నుల నుంచి వస్తున్న ఆదాయాన్ని టారిఫ్స్ కవర్ చేస్తాయని తెలుస్తోంది. 1870-1913 మధ్య కాలాన్ని సుంకాల నుంచి ఆదాయం ద్వారా నడిపిన ఆర్థిక విజయానికి ఉదాహరణగా ట్రంప్ ఉదహరించారు. ఆ కాలంలో సాధించిన సంపదతో పాటు ఆర్థిక వృద్ధిని తాజాగా ట్రంప్ హైలైట్ చేశారు. అమెరికాలో ఆదాయపు పన్ను విధానం 1913లో వచ్చిందని, దీనికి ముందు ప్రజలపై ఎలాంటి వ్యక్తిగత ఆదాయపు పన్నులు లేవని ట్రంప్ పేర్కొన్నారు. ఆ సమయంలో డబ్బుతో పార్కులు, ఇతర అభివృద్ధి పనులు చేసినట్లు ట్రంప్ వెల్లడించారు.