Usha teacher-16 ఏళ్లుగా అడవిలో నడిచి వెళ్లి ,నదిలో పడవ పై స్కూల్ కి వెళ్లి పాఠాలు చెప్తున్న ఉషా టీచర్…వివరాలు…..

www.mannamweb.com


కేరళలోని నెయ్యార్‌ అటవీప్రాంతంలో అగస్త్యర్కూడం గ్రామం ఎత్తైన కొండపైన ఉంది. గిరిజన బాలల కోసమే ఇరవై ఏళ్ల క్రితం అక్కడో పాఠశాల ఏర్పాటైంది. స్కూల్‌లో తక్కువ మంది చిన్నారులున్నా… టీచర్లకు మాత్రం అక్కడ పనిచేయాలంటే హడల్‌.
ఎందుకంటే పడవ ప్రయాణం చేసి… ఏనుగులూ, చిరుతలూ సంచరించే అడవిలో నడుచుకుంటూ.. కొండలూ గుట్టలూ ఎక్కితేనే ఆ స్కూల్‌ని చేరుకోగలం. గత పదహారేళ్లుగా ఉషాకుమారి అలానే బడికెళుతోంది. ఉదయం ఏడున్నరకి ఇంట్లో బయల్దేరి నది వరకూ స్కూటీపై వచ్చే ఉష అక్కడి నుంచి పడవ ఎక్కి అడవి వద్దకు చేరుకుంటుంది. కర్రసాయంతో అడవి కమ్మేసిన కొండని ఎక్కుతూ మార్గమధ్యంలోని తండాల్లో ఉండే పిల్లల్ని కూడా బడికి తీసుకెళుతుంది. మధ్యాహ్న భోజనం పథకం కింద నిధులు సక్రమంగా రాకపోయినా ఆమె జీతం వెచ్చించి మరీ చిన్నారులకు కడుపునింపుతుంది. ఉష ఒక్కరే ఆ స్కూల్లో టీచర్‌. గిరిజనుల జీవితంలో మార్పు తేవాలన్న ధ్యేయంతోనే ఎంత కష్టమైనా ఆ బడిలో పనిచేస్తున్న ఉష సెలవులు కూడా పెట్టడానికి ఇష్టపడదంటే నమ్ముతారా!