Water Heater: వాటర్ హీటర్‌ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా, లేదా.?

www.mannamweb.com


Water Heater: వాటర్ హీటర్‌ వాడుతున్నారా.. ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా, లేదా.?

వర్షాకాలం వచ్చేసింది. వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది. దీంతో చాలా మంది స్నానానికి వేడి నీళ్లు ఉపయోగిస్తున్నారు. అయితే గ్రిజర్స్‌ ఉన్న వారికి పెద్దగా ఇబ్బంది ఉండకపోవచ్చు. కానీ వాటర్‌ హీటర్స్‌ ఉపయోగిస్తున్న వారు మాత్రం జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. వాటర్‌ హీటర్‌ ఉపయోగించే సమయంలో కచ్చితంగా కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిందే. లేదంటే ప్రమాదం తప్పదు. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏంటంటే..

ఇంట్లో చిన్న పిల్లలు ఉంటే వాటర్ హీటర్‌ను ఎక్కడపడితే అక్కడ పెట్టకూడదు. పొరపాటు వారు వెళ్లి వాటర్‌ను టచ్‌ చేస్తే ప్రమాదం తప్పదు. అందుకే ఒక మూలకు లేదా ప్రత్యేకంగా ఒక గదిలో వాటర్‌ హీటరను ఏర్పాటు చేసుకోవాలి.

ఒకవేళ వాటర్ హీటర్‌ను ప్లాస్టిక్‌ బకెట్‌లో పెడితే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. నేరుగా బకెట్‌కు హీటర్‌ హుక్‌ను తగిలించకూడదు. ఇలా చేస్తే వేడికి ప్లాస్టిక్‌ కరిగిపోతుంది. కాబట్టి బకెట్‌కు మధ్యలో ఒక క్రను ఉంచి దానికి మధ్యలో వాటర్‌ హీటర్‌ను వేలాడదీయాలి. ఇక వీలైనంత వరకు అల్యూమినియం బకెట్‌లను ఉపయోగించడం మంచిది.

కొందరు వాటర్‌ హీటర్‌లను అలాగే గంటల కొద్దీ ఆన్‌లోనే ఉంచుతుంటారు. అయితే ఇలా చేయడం వల్ల నీరు బాగా వేడెక్కుతాయని భావిస్తారు. నీళ్లు వేడెక్కడం అటుంచితో కొన్ని సందర్భాల్లో షార్ట్‌ సర్క్యూట్ అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి గంటల తరబడి ఆన్‌లో ఉంచకూడదు.

ఇక వాటర్‌ హీటర్‌లను ఎట్టి పరిస్థితుల్లో బాత్‌రూమ్‌లలో ఏర్పాటు చేసుకోకూడదు. దీనివల్ల బాత్‌రూమ్‌లో ఉండే తడి కారణంగా కొన్ని సందర్భాల్లో షాక్‌ వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి వాటర్‌ హీటర్‌ను బయట పెట్టుకోవడమే ఉత్తమం.

వాటర్‌ హీటర్‌ రాడ్ పూర్తిగా నీటిలో మునిగేలా చూసుకోవాలి. లేదంటే రాడ్‌ పాడయ్యే అవకాశం ఉంటుంది. అలాగే స్విఛ్‌ ఆఫ్‌ చేసిన వెంటనే నీటిలో చేయి పెట్టి వేడిని టెస్ట్ చేయకూడదు. బోర్డ్‌ నుంచి ప్లగ్‌ను తీసిన తర్వాతే చేయి పెట్టాలి.