అంతరించిపోతున్న ఈ చెట్టు కాయలు కనిపిస్తే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి.. బంగారం కన్నా విలువైనది

www.mannamweb.com


మనిషి జీవన విధానం మారుతున్నకొద్దీ ఎన్నో రకాల జంతువులు, చెట్లు, పక్షులు అంతరించిపోతున్నాయి. నాగరికతను పెంచుకోవడానికి లక్షలాది చెట్లను నాశనం చేసేస్తున్నారు.

పెద్ద పెద్ద భవంతులు కట్టడానికి రోడ్ల విస్తరణ, పొలాల విస్తరణ అని పురాతన చెట్లను కూడా నాశనం చేసేస్తున్నారు. అలా అంతరించిపోతున్న చెట్లలో నల్ల తుమ్మ చెట్టు కూడా ఒకటి.

ఈ చెట్టుకు ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. కఫము, దగ్గు వంటి సమస్యలను చెక్ పెట్టేందుకు ఈ చెట్టు బెరడును వాడుతుంటారు. ఇప్పటికీ చాలా మంది వృద్ధులు, 80 సంవత్సరాలు కలిగిన వారు ఈ నల్లతుమ్మ చెట్టు యొక్క బెరడును దగ్గు వచ్చినప్పుడు నములుతుంటారు. అంతటి గొప్ప ఔషధ గుణాలు కలిగిన ఈ చెట్టు అంతరించిపోవడం నిజంగా దురదృష్టకరం.

అయితే ఈ చెట్టులో మాత్రమే కాదు ఈ చెట్టు కాయలో కూడా ఎన్నో ఔషధ గుణాలు, ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఉన్నాయి. ఈ చెట్టు కాయలు ఎక్కడ కనిపించినా వెంటనే తెచ్చి ఇంట్లో పెట్టుకోండి ఇవి మీకు చాలా ఆరోగ్య సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అయితే ఈ నల్లతుమ్మ చెట్టు కాయలతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటి? అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.

జీర్ణ సమస్యలు దూరం..

నల్ల తుమ్మ చెట్టు కాయలతో జీర్ణ సమస్యలు దూరం అవుతాయి. ఈ కాయలను తీసుకోవడం వల్ల కడుపునొప్పి, వాంతులు, విరేచనాలు, జీర్ణ రుగ్మతలు వంటి సమస్యలు నయం అవుతాయి. అపానవాయువు, అల్సర్ వంటి సమస్యలను కూడా తగ్గించేందుకు ఇది ఉపయోపగపడుతుంది. అలాగే జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తుంది.

దంతాలను శుభ్రం చేసుకోవడానికి..

ఈ నల్ల తుమ్మ చెట్టు కాయలతో పొడి చేస్తారు. దానిని దంతాలను శుభ్రం చేయడానికి వినియోగిస్తారు. చిగుళ్ల మంట తగ్గించడానికి, దంతాలపై ఉండే పచ్చని పోర తొలగించడానికి ఆ పొడిని వినియోగిస్తుంటారు. ఈ పొడిని తరచుగా వాడడం వల్ల దంతాలు బలపడడంతో పాటు దంతాల నొప్పి వంటి సమస్యలు దూరం అవుతాయి. అలాగే చిగుళ్ల ఆరోగ్యం కూడా బాగుంటుంది.

చర్మ సమస్యల పరిష్కారానికి..

నల్ల తుమ్మ చెట్టు కాయలను పేస్ట్ చేసుకొని, చర్మంపై రాస్తే చర్మ సమస్యలు దూరం అవుతాయి. ఈ పేస్ట్ చర్మంపై ఉండే పొక్కులు, దురదలు, దద్దుర్లను నయం చేస్తుంది. ఈ కాయల్లోని యాంటీ సెప్టిక్ లక్షణాలు గాయాలు మానడానికి సహాయపడతాయి. అలాగే ఇన్ఫెక్షన్స్ తగ్గిపోవడానికి ఉపయోగపడతాయి.

గొంతు సమస్యలు, దగ్గు కోసం..

ఈ చెట్టు కాయల ద్వారా తీసే కసాయంతో గొంతు సమస్యల నుంచి ఉపశమనం పొందొచ్చు. ముందుగా చెప్పినట్లు ఈ కాషాయం కఫం, దగ్గు, జలుబు, గొంతునొప్పి వంటి సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తుంది. గొంతులో గరగర కూడా ఈ కషాయంతో నయం అవుతుంది. అలాగే శ్వాస తీసుకోవడానికి ఏర్పడే ఇబ్బందులు దూరమై.. మంచిగా శ్వాస తీసుకోవడానికి ఉపయోగపడుతుంది.

మూత్ర సంబంధిత సమస్యలు పరిష్కారమవుతాయి..

ఈ కాయలను పటిక కాయలు అని కూడ పిలుస్తుంటారు. ఈ పటిక కాయల వల్ల మూత్ర సంబంధిత సమస్యలు దూరమవుతాయి. రుతుక్రమ సమస్యలు నయం అవడంతో పాటు గాయాలు కూడా మానిపోతాయి. మూత్ర పిండాలు ఆరోగ్యంగా ఉండేందుకు ఇవి దోహదపడతాయి.

గమనిక: ఈ కథనంలో మేము పొందుపరిచిన అంశాలు పలు అధ్యయనాలు, ఇంటర్నెట్‌లో మాకు దొరికిన సమాచారం ఆధారంగా అందించబడింది. వీటి శాస్త్రీయతను మేము నిర్ధారించడం లేదు. మేము కేవలం సమాచారం అందించడానికి మాత్రమే ప్రయత్నిస్తున్నాము. వీటిని ఎంతవరకు విశ్వసించడం అనేది పూర్తిగా మీ బాధ్యత. దీనికి బోల్డ్ స్కై తెలుగు ఎటువంటి బాధ్యత వహించదు.