టాలీవుడ్ హీరో వరుణ్ సందేశ్ చాలా రోజుల తర్వాత సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన చిత్రం నింద. రాజేశ్ జగన్నాథం తెరకెక్కించిన ఈ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ లో రాజన్న ఫేమ్ అనీ, క్యూ మధు ప్రధాన పాత్రలు పోషించారు.
ఈ ఏడాది జూన్ 21వ తేదీన థియేటర్లలో విడుదలైన నాంది కు పాజిటివ్ టాక్ వచ్చింది. అయితే చిన్న అ న్న ట్యాగ్ ఉండడం, ప్రమోషన్లు కూడా ఎక్కువగా నిర్వహించడంతో నింద లాంగ్ రన్ లో ఆడలేకపోయింది. లోని కథ, కథనాలు, ట్విస్టులతో వరుణ్ సందేశ్ నటన బాగుందని ప్రశంసలు, రివ్యూలు వచ్చాయి. టేకింగ్ పరంగా ఆడియెన్స్ మెప్పు పొందిన నింద మూవీ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ తెలుగు ఓటీటీ సంస్థ ఈటీవీ విన్ సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో సెప్టెంబర్ 6వ తేదీ నుంచి నింద ను డిజిటల్ స్ట్రీమింగ్ చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించింది ఈటీవీ విన్. ‘మంచోడికి న్యాయం జరుగుతుందనే నమ్మకం పోయిన రోజు.. ఒక సమాజం చనిపోయినట్టే.. సెప్టెంబర్ 6న ఈటీవీ విన్‍లో నింద ప్రీమియర్’ అంటూ తమ సోషల్ మీడియా ఖాతాలో వరుణ్ సందేశ్ మూవీ పోస్టర్ ను పంచుకుంది.
నింద లో వరుణ్ సందేశ్‍తో పాటు యానీ, తనికెళ్ల భరణి, భద్రం, సూర్యకుమార్, ఛత్రపతి శేఖర్, మైమ్ మధు, సిద్ధార్థ్ గొల్లపూడి, అరుణ్ దలై కీలకపాత్రలు పోషించారు. ఓ హత్య కేసులో విచారణ విషయంలో పోలీస్ ఆఫీసర్లను, డాక్టర్‌ను హీరో కిడ్నాప్ చేయడం చుట్టూ ఈ మూవీ సాగుతుంది. నింద చిత్రానికి సంతు ఓంకార్ సంగీతం అందించగా.. రమీజ్ నవ్‍వీత్ టోగ్రాఫర్ గా వ్యవహరించారు. . దర్శకుడు రాజేష్ జగన్నాథం ఈ మూవీకి నిర్మాతగానూ వ్యవహరించారు.
కాగా వరుణ్ సందేశ్ నటించిన మరో సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ ఇప్పటికే ఆహా ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది.