జ్యోతిష్యశాస్త్రం ఎంత ముఖ్యమైనదో వాస్తు శాస్త్రం కూడా అంతే ముఖ్యమైనది. మన జీవితంలో ఎదురయ్యే వివిధ సమస్యలకు పరిష్కారాలు వాస్తు శాస్త్రంలో ఉన్నాయని చెబుతారు.
కాబట్టి వాస్తు శాస్త్రంలో సూచించిన విధంగా చర్యలు చేపడితే మీ ఇంట్లో తగదాలు ఉండవు,శాంతి-ఆనందం నెలకొంటుంది. అయితే వాస్తు ట్రెండ్ ఈనాటిది కాదు. మహాభారత కాలం నుంచి వాస్తు ట్రెండ్ కొనసాగుతోందని మీకు తెలుసా. శ్రీ కృష్ణుడే స్వయంగా వాస్తు గురించి కొన్ని విషయాలను చెప్పాడు.
మహాభారత యుద్ధం తర్వాత యుధిష్ఠిరుని పట్టాభిషేక సమయం వచ్చినప్పుడు శ్రీ కృష్ణుడు రాజ్యం, ఇంటి ఆనందం, శ్రేయస్సు కోసం కొన్ని ప్రత్యేక వాస్తు టిప్స్ గురించి యుధిష్ఠిర్ తో చెప్పాడు. ప్రతి ఒక్కరూ శ్రీ కృష్ణుడు చెప్పిన వాస్తు నియమాలను అనుసరించడం ప్రారంభిస్తే ఖచ్చితంగా వారి జీవితంలో శుభ ఫలితాలను పొందుతారు. కాబట్టి శ్రీ కృష్ణుడు స్వయంగా చెప్పిన ఆ వాస్తు నియమాలు ఏమిటో ఇక్కడ చూడండి.
శ్రీ కృష్ణుడు చెప్పిన వాస్తు సూచనలు
మహాభారతంలో శ్రీకృష్ణుడు, యుధిష్ఠిరుల మధ్య సంభాషణ ప్రకారం ఇంట్లో చాలా వస్తువులు ఉంటే చాలా శ్రేయస్కరం. కానీ వాస్తు యాంగిల్ లో ఐదు వస్తువులు కలిగి ఉండటం చాలా ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. ఇవి సానుకూలతను మాత్రమే కాకుండా ఆనందం, శ్రేయస్సును కూడా తెస్తాయి.
ప్రధాన ద్వారం దిశ
రాజు నివసించే రాజభవనం ప్రధాన ద్వారం తూర్పు దిశలో ఉండాలని శ్రీకృష్ణుడు యుధిష్ఠిర్ తో చెప్పాడు. ఈ దిశ సూర్య భగవానుడి శక్తిని సూచిస్తుంది, మంగళకరమైనదిగా పరిగణించబడుతుంది. ఇది రాజ్యానికి సమృద్ధి,బలం, స్థిరత్వాన్ని తెస్తుంది. అందుకే ఇప్పటికీ గృహ ప్రవేశాన్ని తూర్పు దిశలో ఉంచాలని సూచిస్తుంటారు.
ఇంట్లో తేనె
ఇంట్లో ఆనందం, సామరస్యాన్ని కలిగించే పదార్ధం తేనె అని శ్రీ కృష్ణుడు యుధిష్ఠిర్ కు చెప్పాడు. తేనె ఇంట్లో ఉండటం వల్ల ఇంటి వాతావరణం స్వచ్ఛంగా, మధురంగా ఉంటుంది. ఇంట్లో తేనె ఉంచడం వల్ల మనిషి ఆత్మ శుద్ధి అవుతుందని పండితులు చెబుతారు.
ఇంట్లో నీళ్లు పెట్టే ప్లేస్
శ్రీ కృష్ణుడు యుధిష్ఠిర్ తో మాట్లాడుతూ ఇంటిలో ఎల్లప్పుడూ త్రాగునీటికి సరైన ఏర్పాట్లు ఉండాలని చెప్పాడు. ఇంట్లో తాగునీరు పెట్టే ప్లేస్ ఈశాన్య దిశలో ఉండాలి. దీన్నే భగవంతుని దిశ అంటారు. ఇది నీటిని నిల్వ చేయడానికి ఉత్తమమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది.
సరస్వతి తల్లి విగ్రహం
శ్రీ కృష్ణుడి ప్రకారం సరస్వతి తల్లి బురద నుండి ఉద్భవించిన కమలంపై కూర్చున్నట్లుగా ఉన్న ఫొటో ఇంట్లో ఉండటం వల్ల సంతోషం,శాంతి ఉంటుంది. అదేవిధంగా ఇంట్లో సరస్వతీ దేవిని పూజించడం ద్వారా తెలివిని మీకు ఇవ్వడమే కాకుండా స్వచ్ఛంగా ఉంచి పేదరికం నుండి దూరంగా ఉంచుతుందని పండితులు చెబుతున్నారు.
గంధంతో వాస్తు దోషాలు పోతాయ్
శ్రీ కృష్ణుడు యుధిష్ఠిర్‌తో చెప్పినట్లు గంధం ఎల్లప్పుడూ స్వచ్ఛంగా ఉంటుంది, దాని సువాసన కూడా తగ్గదు. అందుచేత గంధాన్ని ఇంట్లో ఉంచుకోవడం వల్ల నెగటివ్ ఎనర్జీ ప్రభావం ఉండదు. దీంతో వాస్తు దోషాలు తొలగిపోతాయని పండితులు తెలిపారు.