Vastu Tips for Plants: ఇంటి బయట మామిడి చెట్టు నాటడం శుభమా? అశుభమా?

Vastu Tips for Plants: ప్రతి ఒక్కరూ ఇంటి బయట చెట్లు, మొక్కలు నాటేందుకు ఇష్టపడతారు. కానీ ప్రతి మొక్క యొక్క స్వభావం భిన్నంగా ఉంటుంది. ఒక చెట్టును నాటడం ద్వారా కొన్ని కుటుంబాలు సుభిక్షంగా మారితే మరికొన్ని పేదరికంలో మునిగిపోతాయి. మామిడితో సహా అటువంటి 6 మొక్కల గురించి వాటి శుభ, అశుభ ప్రభావాల గురించి తెలుసుకుందాం.


1. ఉసిరి మొక్క

మత పండితుల ప్రకారం, ఉసిరి చెట్టు విష్ణువుకు చాలా ప్రియమైనది. ఇక్కడ సకల దేవతలు కొలువై ఉంటారని చెబుతారు. ఈ చెట్టు అన్ని కోరికలను నెరవేరుస్తుందని భావిస్తారు. ఈ చెట్టు ఇంటికి ఉత్తరం లేదా తూర్పు దిశలో నాటినప్పుడే మంచి లాభాలను ఇస్తుంది.

2. అశోక చెట్టు

అశోక చెట్టు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇది ఇంటికి కాపలాగా పనిచేస్తుంది. ఈ చెట్టును నాటిన ఇంట్లో పరస్పర సామరస్యం, సంతోషం, శాంతి నెలకొంటాయని వాస్తు శాస్త్రంలో చెప్పబడింది. ఇంటి బయట అశోక వృక్షాన్ని నాటడం వల్ల ఇతర అశుభ వృక్షాల దుష్ఫలితాలు తొలగిపోతాయని కూడా నమ్ముతారు.

3. శమీ మొక్క

వాస్తు శాస్త్రంలో, శమీని శుభ ప్రభావాలను ఇచ్చే మొక్కగా పరిగణిస్తారు. శమీ మొక్కను పూజించడం ద్వారా శని దేవుడి అనుగ్రహం కుటుంబంపై ఉంటుందని నమ్ముతారు. అయితే ఇంటి మెయిన్ గేటుకు ఎడమవైపున కొంచెం దూరంలో దాని నీడ ఇంటిపై పడకుండా అమర్చుకోవాలి. ఇలా చేయడం ద్వారా మాత్రమే ఇది ఉత్తమ ప్రభావాన్ని కలిగి ఉంటుంది.

4. మామిడి చెట్టు

మామిడి చెట్టును పొరపాటున కూడా ఇంటి దగ్గర నాటకూడదు. ఇది పిల్లలకు హానికరంగా పరిగణించబడుతుంది. దీనికి కారణం మామిడికాయలు కోయాలనే అత్యాశతో పిల్లలు చెట్టు ఎక్కి గాయపడవచ్చు లేదా దారిన వెళ్లేవారు మామిడి కాయలు కోయడానికి రాళ్లు విసరడం వల్ల ఎవరైనా గాయపడవచ్చు.

5. అరటి చెట్టు

వాస్తు శాస్త్రంలో, ఇంటి లోపల లేదా వెలుపల అరటి చెట్లను నాటడం చాలా శుభప్రదంగా పరిగణించబడుతుంది. ఈ మొక్కలో విష్ణువు ఉంటాడని చెబుతారు. ప్రతి గురువారం పూజ చేస్తారు. జ్ఞాపకశక్తి తక్కువగా ఉన్న వ్యక్తి అరటిచెట్టు కింద కూర్చుని చదువుకుంటే మేధావి అవుతాడని నమ్మకం.

6. అశ్వగంధ మొక్క

అశ్వగంధ ఒక ఆయుర్వేద మొక్క. ఇది వాస్తు శాస్త్రంలో కూడా చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది. ఇంట్లో కలహాలు ఏర్పడితే కేతువును శాంతింపజేయడానికి అశ్వగంధ మూలాన్ని తన ఇంటి గుడిలో ఉంచి పూజలు చేయడం ప్రారంభించాలని చెబుతారు. ఇలా చేయడం వల్ల వాస్తు దోషాలు తొలగిపోయి ఇంట్లో సుఖశాంతులు కలుగుతాయి.