Vastu Tips: ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే అరిష్టమా? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది

www.mannamweb.com


Vastu Tips: ఇంట్లో తులసి మొక్క ఉంటే ఆ ఇంటికి లక్ష్మీ కటాక్షం కలుగుతుంది. తులసి మొక్కను పెరటి గుమ్మానికి ఎదురుగా అంటే ఇంట్లోని గదులన్నీ నేరుగా ఉండే రోజుల్లో..

వాకిట్లో నుంచి చూస్తే పెరట్లోని తులసి మొక్క కనిపించేది. అలా ఇల్లు ఉన్నవాళ్లు చక్కగా తులసి మొక్కను ఏర్పాటు చేసుకుంటారు. తులసి మొక్క ఇంట్లో ఉంటే అదృష్టంగా భావిస్తారు. మరీ ముఖ్యంగా తులసి మొక్క పచ్చగా ఉంటే ఆ ఇంట్లో సానుకూల శక్తి ఉంటుంది. కానీ ఎండిపోయి కుళ్లిపోతుంటే అది అరిష్టానికి సంకేతంగా భావించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది. వర్షాకాలంలో తులసి మొక్క ఎండిపోయే అవకాశాలు తక్కువ. కానీ మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతుంటే వాస్తు నివారణలు, మొక్క ఎండిపోవడానికి గల కారణాలను తెలుసుకోవల్సిందే.

తులసి మొక్క ఎండిపోవడానికి కారణాలు :

1. ఆర్థిక సమస్యలు:

తులసి మొక్క లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతున్నట్లయితే మీరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొబోతున్నారనడానికి సంకేతం కావచ్చు.

2. పిత్రుదోషం:

మీ ఇంట్లో పితృదోషం ఉంటే తులసి మొక్క ఎండిపోయే అవకాశం ఉందని వాస్తు శాస్త్రం చెబుతోంది. మీ ఇంట్లో పిత్రుదోషం ఉంటే గొడవలు, అదనపు సమస్యలకు దారి తీయవచ్చు.

3. గ్రహస్థితులు:

మీ ఇంట్లో ప్రతికూల శక్తి ప్రభావితమవుతే.. తులసి మొక్క ఎండిపోయే అవకాశం ఉంటుంది.

4. కుటుంబంలో సమస్యలు:

మీ ఇంట్లో తులసి మొక్క ఆకస్మాత్తుగా చనిపోతే.. మీ కుటుంబానికి పెద్ద సమస్యలు రాబోతున్నాయనడానికి సంకేతంగా భావించాలని వాస్తు శాస్త్రం చెబుతోంది.

5. రాబడి లేకపోవడం:

తులసి మొక్క ఎండిపోవడం అనేది మీకు రాబడిలో నష్టం జరుగుతుందనడానికి సంకేతం. ఇది మీ బ్యాంక్ అకౌంట్ ను ప్రభావితం చేస్తుంది.

తులసి మొక్క ఎండిపోవడానికి నివారణలు:

⦿ మీ ఇంట్లో తులసి మొక్క ఎండిపోతే.. దానిని ఎక్కువ కాలం ఉంచకూడదు. ఎందుకంటే ఇది ప్రతికూలశక్తిని కలిగిస్తుంది. పవిత్రమైన తులసి మొక్క ఎండిపోతే దాని నుంచి వచ్చే దుష్ప్రభావాలను ఎలా తగ్గించాలో చూద్దాం.

⦿ తులసి మొక్క ఎండిన వేర్లు, ఆకులను పారే నదిలో వేయండి. చెరువు, లేదా సరస్సులో కూడా వేయవచ్చు.

⦿ ఎండిపోయిన తులసి మొక్కను తీసివేసే ముందు తులసి మంత్రం, మహా ప్రసాదం సమర్పించిన తర్వాత తీయాలి.

⦿ ఎండిపోయిన తులసి తీసిన వెంటనే వీలైనంత వరకు త్వరగా దాని స్థానంలో కొత్త తులసి మొక్కను నాటాలి. కొత్త తులసి మొక్కకు నీళ్లు పోసేటప్పుడు మహా ప్రసాద జనని, సర్వ సౌభాగ్య వర్ధిని ఆది వ్యాధి. ఈ మంత్రాన్ని పఠించాలి.

⦿ తులసి మొక్కను ప్రతిరోజూ పూజించాలి. ఆదివారం మినహా ప్రతిరోజూ తులసి మొక్కకు నీరు పోయాలి. ఏకాదశి రోజు తులసి ఆకులను కోయకూడదు.

తులసి మొక్కను ఎలా కాపాడాలి?

తులసి మొక్కకు ఉండే వెన్నును క్రమం తప్పకుండా తీసి జాగ్రత్తగాచూస్తుండాలి. అప్పుడే తులసి మొక్క నిటారుగా చక్కగా పెరుగుతుంది. కొంతమంది తులసి మొక్క వెన్ను ఎక్కువగా పెరిగితే ఇంటిఇల్లాలు తలనొప్పితో బాధపడుతుందని అంటుంటారు. దీనికి శాస్త్రీయంగా ఎలాంటి ఆధారం లేదు.