Vastu Tips: ఇంట్లో గడియారం తప్పు దిశలో ఉంచుతున్నారా.. అయితే ఈ తిప్పలు తప్పవు?

మామూలుగా మనం గడియారం విషయంలో తెలిసి తెలియక కొన్ని రకాల తప్పులు చేస్తూ ఉంటాము. వాటి వల్ల నెగటివ్ ఎనర్జీ తో పాటు కొన్ని రకాల సమస్యలను కూడా ఎదుర్కోవాల్సి ఉంటుంది.
గడియారాలను సమయాన్ని తెలుసుకోవడానికి మాత్రమే కాకుండా ఇంటి అలంకరణ కోసం కూడా ఉపయోగిస్తూ ఉంటాము. అందంగా కనిపించే గడియారం గది అందాన్ని పెంచటం కోసమే కాకుండా ఇంట్లో వాస్తు నియమాలను దృష్టిలో పెట్టుకొని కూడా పెట్టుకోవాలి. వాస్తు శాస్త్ర ప్రకారం ఇంట్లో గడియారని పెట్టేటప్పుడు తప్పకుండా వాస్తు విషయాలను పాటించాలి. ఏ దిశలో పడితే ఆ దిశలో పెట్టకుండ సరైన దిశలో మాత్రమే పెట్టాలి. మరి వాస్తు ప్రకారం గడియారని ఏ దిశలో అమర్చకూడదో ఇప్పుడు మనం తెలుసుకుందాం..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

గోడ పై గడియారాన్ని ఉంచడానికి ఉత్తమమైన దిశ ఈశాన్య దిశ. డ్రాయింగ్ రూమ్, బెడ్ రూమ్ లేదా పూజ గది ఏ గదిలో ఉంచినప్పటికీ ఈశాన్య దిశలోనే గడియారాన్ని పెట్టడం మంచిది. ఈశాన్యంలో గడియారాన్ని పెట్టడానికి స్థానం లేకపోతే రెండవ ప్రాధాన్యత ఉత్తర దిశ. ఉత్తర దిశలో కూడా పెట్టడానికి స్థానం లేకపోతే మూడవ ప్రాధాన్యత తూర్పు దిశ. ఈ దిశల్లో పెడితేనే గడియారం ప్రతికూల ఫలితాలను ఇవ్వదు. అంతేకాదు సరైన దిశలో గడియారం పెట్టడం వల్ల అనుకూల ఫలితాలు వస్తాయి. అందుకే గడియారం పెట్టుకునే విధానంలో కొన్ని ముఖ్యమైన వాస్తు నియమాలను కచ్చితంగా పాటించాలి. గడియారం పెట్టుకున్నప్పుడు గడియారం నడుస్తుంది అనే విషయాన్ని కచ్చితంగా నిర్ధారించుకోవాలి. ఈశాన్య దిశలో గడియారం పెట్టుకుంటే గౌరవం, కీర్తి, శ్రేయస్సు లభిస్తాయి.

ఉత్తర దిశలో గడియారాన్ని పెట్టడం వల్ల సంపద లభిస్తుంది. ఇది వృత్తిలో అడ్డంకులను తొలగిస్తుంది. ఏదైనా కారణం చేత ప్రమోషన్ ఆగిపోయినా లేదా ఉద్యోగం ఆగిపోయినా, వ్యాపార లావాదేవీలు ఆగిపోయినా ఉత్తర దిశలో గడియారం పెట్టడం వల్ల ఆ ఇబ్బందులు అన్ని తొలగిపోతాయి. తూర్పు దిశలో గడియారాన్ని పెడితే కుటుంబ సభ్యులకు సంతోషం ఉంటుంది. అయితే నైరుతి మరియు దక్షిణ గోడలపై గడియారాలు ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు ఇంటి తలుపు ఫ్రేమ్ పై కూడా గోడ గడియారాన్ని పొరపాటున కూడా ఉంచకూడదు. డోర్ ఫ్రేమ్ పై గోడ గడియారం పెట్టడం వల్ల ఆ ఇంట్లోని వారు బయటకు వెళ్ళే సమయం ఆసన్నమైందని అర్థం అంటున్నారు. ఇంట్లో దుర్వార్త వినాల్సి వస్తుంది. అలాగే ఎప్పుడూ ఇంట్లో ఆగిపోయిన గడియారాలు చెడిపోయిన గడియారాలు అస్సలు పెట్టుకోకూడదు. వీలైనంత తొందరగా వాటిని తీసి బయట పడేయడం మంచిది.

Related News

Related News