ఏపీలో ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డి అరెస్ట్

ఉద్యోగుల సంఘం నేత వెంకట్రామిరెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆయనను ఎక్సైజ్ పోలీసులు అర్ధరాత్రి అరెస్ట్ చేశారు. సచివాలయ క్యాంటీన్ ఎన్నికల్లో ఉద్యోగులను ప్రలోభపెట్టేందుకు మందు, విందు పార్టీలు ఇచ్చారు.


వెంకట్రామిరెడ్డి, పలువురు ఉద్యోగులు కలిసి పార్టీ ఇచ్చినట్లు తెలుస్తుంది. ముందస్తు సమాచారంతో ఎక్సైజ్ పోలీసులు దాడి చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని కొండపావులూరి గార్డెన్లో పార్టీకి ఏర్పాట్లు నిర్వహించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.