సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ దళపతి విజయ్ తన సినీ కెరీర్‌కు కొంత విరామం ఇవ్వనున్నాడు. రాజకీయాల్లోకి రావడానికి విజయ్ సిద్ధంగా ఉన్నాడు. దళపతి హీరోగా నటిస్తున్న చివరి రీసెంట్ గానే ప్రకటించారు.
విజయ్ కెరీర్‌లో ఇది 69వ చిత్రం. ఈ నేపథ్యంలో విజయ్ 70 పూర్తి కాకుండానే 69 లతో తన నటజీవితాన్ని ఎందుకు ముగించుకుంటున్నాడనేది ఇప్పుడు విజయ్ అభిమానుల్లోని ప్రశ్న. అయితే ఇప్పుడు దీనిపై ఆసక్తికరమైన రూమర్స్ కోలీవుడ్ లో వినిపిస్తున్నాయి.
న్యూమరాలజీ ప్రకారం, 69 చాలా ప్రత్యేకమైన సంఖ్య. మీరు 69ని రెండుగా విడదీసినప్పుడు. 6, 9 సంఖ్యలు అవుతాయి . అందులో 6 ప్రేమ, సంరక్షణ అలాగే ఐక్యతను సూచిస్తుంది. ఇక 9 అధికారం, నాయకత్వాన్ని సూచిస్తుంది. అలాగే, న్యూమరాలజీ ప్రకారం 69 సంఖ్య ఏదైనా ముగించడానికి, కొత్తదాన్ని ప్రారంభించడానికి ఉత్తమమైనది అని అంటుంటారు. అలాగే 69 ప్రకారం మన జీవితంలో ఒక ముఖ్యమైన దశ ముగింపును సూచిస్తుంది. ఇది జీవితంలో కొత్త లక్ష్యాన్ని కనుగొని కొత్త మార్గాన్ని అనుసరించామని సూచిస్తుందట. దాంతో విజయ్ తన సినీ కెరీర్‌ను 69వ నంబర్‌తో ముగించుకుని రాజకీయాల్లోకి రావడానికి ఇదే కారణమని పలువురు అభిప్రాయపడుతున్నారు.
అదే సమయంలో ‘దళపతి 69’ అనే టైటిల్‌తో విజయ్ నటిస్తున్న నయా ఇటీవలే అనౌన్స్ చేశారు. ‘దళపతి 69’కి ‘తీరన్’, ‘తునీవ్’ వంటి చిత్రాల దర్శకుడు హెచ్ వినోద్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇది ‘ది టార్చ్‌బేరర్ ఆఫ్ డెమోక్రసీ’ అనే ట్యాగ్‌లైన్‌తో వస్తుంది. కాబట్టి ఈ రాజకీయాల నేపథ్యంలో సాగుతుందని అంటున్నారు. కెవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రానికి సంగీతం అనిరుధ్ రవిచందర్ స్వరాలు సమకుర్చారు. ఈ ఏడాది షూటింగ్ ప్రారంభం కానున్న ‘దళపతి 69’ అక్టోబర్ 2025లో థియేటర్లలోకి రానుంది.
విజయ్ తాజా చిత్రం ‘గోట్ థియేటర్లలో మంచి వసూళ్లను రాబడుతోంది. విడుదలైన కొద్ది రోజుల్లోనే ఈ బాక్సాఫీస్ వద్ద 300 కోట్ల కలెక్షన్లను దాటేసింది. ఈ లో విజయ్ ద్విపాత్రాభినయం చేశాడు. ఈ లో త్రిష, శివకార్తికేయన్‌ల అతిధి పాత్రలు చేశారు. ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, స్నేహ, లైలా, జయరామ్, మీనాక్షి చౌదరి, మోహన్, అజ్మల్ అమీర్, యోగి బాబు, వీటీవీ గణేష్, వైభవ్, ప్రేంగి, అరవింద్ , అజయ్ రాజ్ తదితరులు నటించారు.