Vijayasaireddy: అందుకే వదిలేశా.. జగన్‌కు విజయసాయిరెడ్డి కౌంటర్

మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డికి (Former CM YS Jaganmohan Reddy) మాజీ ఎంపీ విజయసాయి రెడ్డి (Former MP Vijasai Reddy) స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చారు.


నిన్న (గురువారం) జగన్ ప్రెస్‌మీట్‌లో క్యారెక్టర్, విలువలపై పలు వ్యాఖ్యలు చేశారు. దీనిపై సాయి రెడ్డి కౌంటర్ ఇస్తూ.. విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదని అన్నారు. ఈ మేరకు ఎక్స్‌లో పోస్టు చేశారు మాజీ ఎంపీ. ఇప్పుడు సాయిరెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి.

సాయిరెడ్డి ట్వీట్..

”వ్యక్తిగత జీవితంలో కూడా విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉన్నవాడిని కాబట్టే, ఎవరికీ ఎలాంటి ప్రలోభాలకు లొంగలేదు. భయం అనేది నాలో ఏ అణువు అణువులోనూ లేదు కాబట్టే రాజ్యసభ పదవిని, పార్టీ పదవులతో పాటు రాజకీయాలనే వదులుకున్నా” అంటూ ట్వీట్ చేశారు మాజీ ఎంపీ.

జగన్‌ ఏమన్నారంటే..

కాగా.. నిన్నటి ప్రెస్‌మీట్‌లో విజసాయిరెడ్డి గురించి ప్రస్తావించారు జగన్. విజయసాయిరెడ్డి పార్టీ నుంచి రాజీనామా చేసి పార్టీ పదవులకు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసి వెళ్లిపోవడంపై మీడియా అడిగిన ప్రశ్నలకు జగన్ స్పందిస్తూ కౌంటర్ ఇచ్చారు. రాజకీయాల్లో ఉన్న వ్యక్తులకు విలువలు, విశ్వసనీయత, క్యారెక్టర్ ఉండాలని అటువంటప్పుడే అతడిని నాయకుడిగా ఎదుటివాళ్లు చూపిస్తారని, కాలర్ ఎగరేసుకుని తిరగడానికి కూడా వీలుంటుందని అన్నారు. అలాగే సాయిరెడ్డితో పాటు పార్టీ నుంచి వెళ్లి పోయిన ముగ్గురు రాజ్యసభ సభ్యులు విషయంలో ఎవరికైనా ఇదే వర్తిస్తుంది అని చెప్పారు. ఒక ఎంపీని, ఎమ్మెల్యేను చూస్తే వీళ్లు నాయకులు, లీడర్లు అనే క్రెడిబులిటీ రావాలని జగన్ పేర్కొన్నారు. ఈ క్రమంలో తనకు వ్యతిరేకంగా జగన్ ఇచ్చిన వ్యాఖ్యలపై కౌంటర్ ఇచ్చారు మాజీ ఎంపీ. జగన్ చెప్పిన విలువలు, విశ్వసనీయత అనే వ్యాఖ్యలనే ఆధారంగా చేసుకుని విజయసాయి స్ట్రాంగ్‌గా కౌంటర్ ఇచ్చారు. భయం లేదు కాబట్టే అన్ని పదవులను వదులుకున్నట్లు తెలిపారు. అయితే ఈ కౌంటర్‌తో విజయసాయి, జగన్‌కు మధ్య యుద్ధం మొదలైనట్లు చెప్పుకోవచ్చు. సాధారణంగా జగన్ వ్యాఖ్యలకు ఎప్పుడూ కూడా కౌంటర్‌ ఇవ్వని విజయసాయిరెడ్డి తొలిసారిగా గట్టిగానే కౌంటర్ ఇవ్వడం ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారింది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.