గ్రామ, వార్డు సచివాలయాలను ఏ, బీ, సీ కేటగిరీలుగా విభజిస్తూ ఏపీ ప్రభుత్వం (Andhra Pradesh News) ఉత్తర్వులు జారీ చేసింది. వివిధ శాఖల పరిధిలోని కార్యదర్శులను ఆయా సచివాలయాలకు సర్దుబాటు చేస్తూ నిర్ణయం తీసుకుంది. కార్యదర్శులకు సాధారణ విధులు కేటాయిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది.
2,500లోపు జనాభా ఉన్న సచివాలయాలకు ఇద్దరు.. 2,501 నుంచి 3,500 వరకు జనాభా ఉన్న సచివాలయాలకు ముగ్గురు సిబ్బందిని కేటాయించింది. అంతకంటే ఎక్కువ జనాభా ఉంటే నలుగురు సిబ్బందిని కేటాయిస్తున్నట్లు పేర్కొంది. 2047 స్వర్ణాంధ్ర లక్ష్యాల సాధనకు వీలుగా, రియల్ టైమ్ పౌర సేవలు అందించేలా సిబ్బందికి విధులు కేటాయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. సచివాలయంలో పంచాయతీ కార్యదర్శి, డిజిటల్ అసిస్టెంట్, మహిళా పోలీసులు ఉండనున్నారు.
































