పాకిస్తాన్ లో ఓ షాకింగ్ ఘటన జరిగింది. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఓ యువకుడు ఏకంగా తన తల్లినే పెళ్లి చేసుకున్నాడు.
కొద్ది రోజుల క్రితమే ఆ యువకుడు తన తల్లిని వివాహం చేసుకోగా, తాజాగా ఈ పెళ్లి విషయాన్ని బయటపెట్టాడు. తన ఇన్ స్టా వేదికగా పెళ్లి ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో వివరించే ప్రయత్నం చేశాడు.
తల్లిని ఎందుకు పెళ్లి చేసుకున్నాడంటే?
పొరుగు దేశం పాకిస్తాన్ కు చెందిన అబ్దుల్ అహ్మద్ అనే 18 ఏండ్ల యువకుడు తన సొంత తల్లిని వివాహం చేసుకోవడం సంచలనం కలిగిస్తోంది. కని పెంచిన మాతృమూర్తిని తన జీవిత భాగస్వామిగా మార్చుకోవడం చర్చనీయాంశంగా మారింది. తన తల్లిని పెళ్లి చేసుకున్న విషయాన్ని స్వయంగా అబ్దుల్ ప్రపంచానికి వెల్లడించాడు. ఇన్ స్టా వేదికగా తమ వివాహానికి సంబంధించిన వీడియోను షేర్ చేశాడు. ఇందులో తల్లిని ఎందుకు పెళ్లి చేసుకోవాల్సి వచ్చిందో చెప్పే ప్రయత్నం చేశాడు. తన తల్లిని శారీరక సుఖం కోసం పెళ్లి చేసుకోలేదని, ఆమెకు మంచి జీవితాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో చేసుకున్నట్లు చెప్పుకొచ్చాడు.
చిన్న వయసులోనే అబ్దుల్ తల్లికి పెళ్లి
అబ్దుల్ తల్లికి చిన్నతనంలోనే పెళ్లి అయ్యింది. ఓ అమ్మాయి, అబ్బాయి పుట్టిన కొద్ది రోజులకే ఆమె భర్త చనిపోయాడు. అప్పటి నుంచి తన పిల్లలను అపురూపంగా పెంచుకుంది. ఎన్ని ఆర్థిక ఇబ్బందులు తలెత్తినా, వారి కోసం ఎంతో కష్టపడింది. తండ్రిలేని లోటు తెలియకుండా వారిని పెద్ద చేసింది. రెక్కలు ముక్కలు చేసుకుని, కష్టపడి చదివించింది. తల్లి కష్టం వృథాకాలేదు. పిల్లలు మంచి ఉద్యోగం సాధించారు. కొడుకు జీవితంలో సెటిల్ అయ్యాడు. అతడికి పెళ్లి చేస్తే తన పని అయిపోతుందని భావించింది అబ్దుల్ తల్లి. కానీ, అబ్దుల్ మరోలా ఆలోచించాడు.
తల్లికి కొత్త జీవితాన్ని ఇవ్వాలని అబ్దుల్ ఆలోచన
అబ్దుల్ తన తల్లి గురించి ఎవరూ చేయని ఆలోచన చేశాడు. చిన్నతనం నుంచి ఆమె పడిన కష్టాన్ని గుర్తు చేసుకున్నాడు. ఆమెకు రెండో వివాహం చేయాలనుకున్నాడు. కానీ, పాకిస్తాన్ లో వింత కట్టుబాట్లు ఉన్నాయి. మగవాడు ఎన్ని పెళ్లిళ్లు అయినా చేసుకోవచ్చు. కానీ, మహిళ ఒకేసారి పెళ్లి చేసుకోవాలి. తన తల్లికి రెండో పెళ్లి చేయాలని భావించినా నిబంధనలు ఒప్పుకోకపోవడంతో చాలా బాధపడ్డాడు. అదే సమయంలో తన తల్లిని ఎవరు పెళ్లి చేసుకున్నా, వారు బాగా చూసుకుంటారో? లేదో? అనే అనుమానం కలిగింది. ఈ నేపథ్యంలో తానే తన తల్లిని పెళ్లి చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నాడు.
మొదట్లో పెళ్లికి ఒప్పుకోని అబ్దుల్ తల్లి
ఈ పెళ్లి విషయాన్ని ముందుగా అబ్దుల్ తన తల్లికి చెప్పాడు. కానీ, ఆమె మొదట్లో అస్సలు ఒప్పుకోలేదు. కానీ, ఆమెకు అబ్దుల్ నచ్చజెప్పడంతో చివరకు ఒప్పుకుంది. ఈ విషయాన్ని పెద్దలకు చెప్పి, వారి సమక్షంలో తల్లిని పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల కిందటే వీరి వివాహం జరిగింది. కానీ, తాజాగా తన పెళ్లి విషయాన్ని అబ్దుల్ వివరించాడు.