తరచూ ఇలా అవుతుందా.. అయితే విటమిన్ బి3 లోపం ఉన్నట్టే..

www.mannamweb.com


శరీరం ఆరోగ్యంగా, అందంగా ఉండాలంటే పలు రకాల విటమిన్లు, మినరల్స్, పోషకాలు అనేవి ఖచ్చితంగా కావాలి. వీటిల్లో ఏది ఎక్కువైనా, తక్కువైనా ఆ తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి ఉంటుంది.

ఇలా శరీరానికి కావల్సిన ముఖ్యమైన పోషకాల్లో విటమిన్ బి3 కూడా ఒకటి. బి3 శరీరంలో ముఖ్యమైన పనులు చేస్తుంది. దీన్నే విటమిన్ పీపీ అని కూడా అంటారు. ఇది నరాల పని తీరు, జీవక్రియ సరిగ్గా ఉండేలా, యాంటీ ఆక్సిడెంట్లు సక్రమంగా పని చేసేలా చేస్తుంది. విటమిన్ బి3 లోపం ఉంటే అనేక లక్షణాలు కనిపిస్తాయి. మరి ఎలాంటి ఆహారాలు తీసుకుంటే మంచిదో ఇప్పుడు తెలుసుకుందాం.

విటమిన్ 3 లక్షణాలు:

అలసట, నీరంగా ఉండటం, చర్మ సమస్యలు, జుట్టు సమస్యలు, మతి మరుపు, డియోన్షియం, డయేరియా వంటి సమస్యలు వస్తాయి.

చికెన్ బ్రెస్ట్:

విటమిన్ బి3 లోపంతో బాధ పడేవారు ఎక్కువగా చికెన్ బ్రెస్ట్‌ని ఎక్కువగా తినాలి. స్కిన్ లెస్, తొడ భాగాలతో పోల్చితే.. బ్రెస్ట్‌లొ మనకు ఎక్కువగా బి3 లభిస్తుంది. అంతే కాకుండా ఇది ప్రోటీన్ రిచ్ ఆహారం. కాబట్టి బి3 లోపిస్తే చికెన్ బ్రెస్ట్ డైట్‌లో చేర్చుకోండి.

వేరు శనగ:

వేరుశనగ తినడం వల్ల కూడా మనకు విటమిన్ బి3 లభిస్తుంది. ఇందులో నియాసిన్, ప్రోటీన్, హెల్దీ మోనోశాచురేటెడ్ టఫ్యాట్స్, విటమిన్ ఇ, మెగ్నీషిం, ఫాస్పరస్, మాంగనీస్ వంటి ఇతర పోషకాలు కూడా లభిస్తాయి. విటమిన్ బి3 తీసుకుంటే టైప్ – 2 డయాబెటీస్ వచ్చే ముప్పు కూడా త్గుతుంది.

అవకాడో:

అవకాడోలో కూడా మనకు విటమిన్ బి3 లభిస్తుంది. ఇందులో దాదాపు 2.6 మిల్లీ గ్రాముల విటమిన్ బి3 ఉంటుంది. అంతే కాకుండా పోటాషియం, పీచు పదార్ఆథలు, ఖనిజాలు, విటమిన్, మినరల్స్ లభిస్తాయి.అవకాడో తినడం వల్ల గుండె, చర్మం కూడా ఆరోగ్యంగా పని చేస్తుంది.

పుట్టు గొడుగులు:

మష్రూమ్స్‌ తినడం వల్ల కూడా విటమిన్ బి3 లోపాన్ని తగ్గించు కోవచ్చు. ఇందులో విటమిన్లు బి1 , బి2, బి3, బి12, బి9, విటమిన్ సి, డి కూడా ఉంటాయి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు.. శరీరం ఆరోగ్యంగా, బలంగా ఉండేలా చేస్తుంది. అదే విధంగా బ్రౌన్ రైస్, పచ్చి బఠాణీలు తిన్నా విటమిన్ బి3 లభిస్తుంది. తరచూ అనారోగ్య సమస్యలకు గురి కావడం.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)