Vitamin E for Skin: విటమిన్ ఈ క్యాప్సూల్స్‌తో షైనీ లుక్‌ని సొంతం చేసుకోండి..

విటమిన్ ఈ చర్మానికి చాలా అవసరం. చర్మం ఆరోగ్యంగా, హైడ్రేట్‌గా ఉండాలంటే విటమిన్ ఈ ముఖ్యం. విటమిన్ ఈ క్యాప్సూల్స్ మనకు నేరుగా కూడా లభిస్తాయి. వీటితో మీ అందాన్ని మరింత సొంతం చేసుకోవచ్చు. మంచి షైనీ లుక్ కావాలి అనుకునేవారు వీటిని ఎలా యూజ్ చేయవచ్చో చూద్దాం..


అందం అందరికీ కావాలి. వయసు పైబడిన వారు కూడా అందంగా కనిపించాలని ఆరాట పడుతూ ఉంటారు. కొంత మందికి వయసు ఉన్నా కూడా ఇంకా యాంగ్ లుక్‌లో కనిపిస్తారు. ఇందుకు కారణం వారు తీసుకునే ఆహారం. సరైన ఫుడ్ తీసుకుంటే ఫిట్, యంగ్‌గా ఉంటారు.

అందం కోసం ఖరీదైన ప్రాడెక్ట్స్ ఉపయోగించాల్సిన పని లేదు. మనకు ఈజీగా లభించే వాటితో కూడా అందాన్ని పెంచుకోవచ్చు. అందాన్ని పెంచడంలో విటమిన్ ఈ క్యాప్సూల్స్ ఎంతో చక్కగా పని చేస్తాయి. వీటితో ముఖానికి మంచి గ్లో తెచ్చుకోవచ్చు.

విటమిన్ ఈ.. చర్మానికి చాలా అవసరం. చర్మాన్ని యంగ్‌గా, ముడతలు, మచ్చలు లేకుండా చేస్తుంది. చర్మానికి మంచి కాంతిని కూడా ఇస్తుంది. అయితే ఎప్పుడైనా సరే విటమిన్ ఈ ఆయిల్‌ని నేరుగా చర్మంపై రాయకూడదు.

విటమిన్ ఈలో నారింజ రసం లేదా బత్తాయి రసం వంటివి కలిపి ముఖానికి పూయవచ్చు. దీని వల్ల మంచి షైనీ లుక్ మీ సొంతం అవుతుంది. మీరు తరచూ వాడే మాయిశ్చరైజర్‌తో కూడా కలిపి రాసినా మంచి లాభాలు ఉంటాయి.

పిగ్మెంటేషన్ సమస్యతో బాధ పడేవారు విటమిన్ ఈ ఆయిల్‌లో బొప్పాయి పండు, రోజ్ వాటర్ కలిపి పేస్టులా కూడా రాయవచ్చు. ఓ పావు గంట సేపు ఉంచి ఆ తర్వాత సాధారణ నీటితో క్లీన్ చేస్తే సరిపోతుంది. ఇలా వారంలో రెండు సార్లు చేస్తే.. మంచి రిజల్ట్ ఉంటుంది.

(NOTE: ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. నిపుణులు అందించిన సమాచారం ప్రకారం ఇక్కడ తెలియజేయడమైనది. ఆరోగ్యరీత్యా ఎలాంటి సమస్యలు ఉన్నా వైద్య నిపుణుల్ని సంప్రదించడం మేలు.)