స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? ప్రముఖ చైనా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం వివో టీ3ఎక్స్ 5జీ ఫోన్ ధర భారీగా తగ్గింది. భారత మార్కెట్లో అన్ని వేరియంట్‌ల ధరలు రూ. వెయ్యి తగ్గాయి. రూ. 15వేల లోపు ధరలో వివో టీ3ఎక్స్ ఫోన్ కొనుగోలు చేయొచ్చు.
Oppo Reno 13 5G Series : ఒప్పో రెనో 13 5జీ సిరీస్ వచ్చేస్తోంది.. ఈ నెల 9నే భారత్‌లో లాంచ్.. ఫీచర్లు వివరాలివే!
వివో టీ3ఎక్స్ కొత్త ధరలు ఇవే :
వివో టీ3 ఫోన్ ధర విషయానికి వస్తే.. మీరు వివో టీ3ఎక్స్ 4జీబీ+ 128జీబీ మోడల్‌ని ఎంచుకుంటే.. ఈ ఫోన్ ధర రూ. 12,499 అవుతుంది. మీరు 6జీబీ+ 128జీబీ మోడల్‌ని ఎంచుకుంటే.. ఫోన్ ధర రూ. 13,999కు పొందవచ్చు. 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్ కలిగిన టాప్-ఎండ్ మోడల్ ధర ఇప్పుడు రూ. 15,499కు అందుబాటులో ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్, ఇతర రిటైల్ పార్టనర్లు, వివో సొంత వెబ్‌సైట్‌తో సహా ఫోన్ విక్రయించే అన్ని ప్రధాన ప్లాట్‌ఫారమ్‌లలో తక్కువ ధరకే అందుబాటులో ఉంది.
వివో టీ3ఎక్స్ 5జీ స్పెసిఫికేషన్‌లు :
వివో టీ3ఎక్స్ 5జీ స్నాప్‌డ్రాగన్ 6 జనరేషన్ 1 చిప్‌సెట్ ద్వారా పవర్ పొందుతుంది. గరిష్టంగా 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజీతో వస్తుంది. మీరు 8జీబీ వరకు వర్చువల్ ర్యామ్ కూడా పొడిగించవచ్చు. ఆప్టిక్స్ విషయానికి వస్తే.. మీరు 2ఎంపీ సెకండరీ షూటర్‌తో పాటు 50ఎంపీ ప్రైమరీ కెమెరాను పొందుతారు. సెల్ఫీల కోసం, మీరు 8ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంటుంది.
డిస్‌ప్లే విషయానికి వస్తే.. మీరు ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్‌కు సపోర్టుతో 6.72-అంగుళాల 120Hz ఐపీఎస్ ఎల్‌సీడీ ప్యానెల్‌ని అందిస్తుంది. బ్యాటరీ విషయానికి వస్తే.. 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్టుతో 6,000mAh బ్యాటరీని కలిగి ఉంది.
ఈ ఫోన్ ఐపీ64 డస్ట్, వాటర్ రెసిస్టెన్స్, డ్యూయల్ స్టీరియో స్పీకర్‌లతో వస్తుంది. ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఫన్‌టచ్ ఓఎస్ 14పై రన్ అవుతుంది. రెండు నానో సిమ్‌లు లేదా ఒక నానో సిమ్, ఒక ఎస్డీ కార్డ్‌కు సపోర్టు ఇచ్చే డ్యూయల్ సిమ్ ఫోన్ అని కూడా చెప్పవచ్చు.