వారెవ్వా వివో నయా ఫోన్ అదిరిందిగా.. అబ్బురపరుస్తున్న ఏఐ ఫీచర్స్‌

www.mannamweb.com


భారతదేశంలో స్మార్ట్‌ఫోన్ల వినియోగం బాగా పెరిగింది. జనాభాకు అనుగుణంగా బడ్జెట్ ఫ్రెండ్లీ స్మార్ట్‌ఫోన్ల అమ్మకాలు తారాస్థాయికు చేరాయి. ఈ నేపథ్యంలో అన్నికంపెనీలు పెరుగుతున్న టెక్నాలజీకు అనుగుణంగా అధునాతన ఫీచర్స్‌తో ఎప్పటికప్పుడు మార్కెట్‌లో కొత్త మోడల్ స్మార్ట్ ఫోన్లను లాంచ్ చేస్తున్నాయి. తాజాగా ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ అయిన వివో టీ3 అల్ట్రా 5జీ పేరుతో నయా స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసింది. మీడియా టెక్ డైమెన్సిటీ 9200+ చిప్‌సెట్ ద్వారా పని చేసే ఈ స్మార్ట్ ఫోన్ ఐపీ68 రేటింగ్ డస్ట్, వాటర్ ప్రొటెక్షన్‌‌తో వస్తుంది. వివో టీ 3 అల్ట్రా 5జీ ఏఐ ఎరేజర్, ఏఐ ఫోటో ఎన్‌హాన్స్ వంటి అనేక ఏఐ ఆధారిత ఫోటో ఫీచర్లను కూడా అందిస్తుంది. ఈ నేపథ్యంలో వివో టీ 3 అల్ట్రా 5జీ స్మార్ట్ ఫోన్ గురించి మరిన్ని వివరాలను తెలుసుకుందాం.

వివో టీ 3 అల్ట్రా 5జీ ఫోన్ 8జీబీ +128 జీబీ వేరియంట్‌లో లాంచ్ చేశారు. అలాగే ఈ ఫోన్ ధర రూ.31,999గా ఉంది. అలాగే 8 జీబీ + 256 జీబీ వేరియంట్ ధర రూ.33,999గా ఉంది. 12 జీబీ + 256 జీబీ వేరియంట్ రూ.35,999కి అందుబాటులో ఉంది. ఈ స్మార్ట్ ఫోన్ భారతదేశంలో సెప్టెంబర్ 19 నుంచి కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో కొనుగోలు చేయవచ్చని కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు. ఈ ఫోన్ రెండు కలర్స్‌లో వినియోగదారులకు అందుబాటులో ఉంటుంది. ఫారెస్ట్ గ్రీన్, లూనార్ గ్రే కలర్ ఆప్షన్స్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

వివో టీ 3 అల్ట్రా 5జీ ఫోన్ 1.5కే రిజల్యూషన్‌తో 6.78 అంగుళాల 3డీ కర్వ్డ్ ఎమోఎల్ఈడీ డిస్‌ప్లేతో వస్తుంది. 120 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌ ఈ ఫోన్ ప్రత్యేకత. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారంగా పనిచేసే ఫన్ టచ్ ఓఎస్ 14పై పనిచేస్తుంది. అలాగే ఈ ఫోన్ 80 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ మద్దుతునిచ్చే 5500 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది. ఈ ఫోన్ వెనుకవైపు డ్యూయల్ కెమెరా సిస్టమ్‌ను కలిగి ఉంది. 50 ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 921 ప్రైమరీ సెన్సార్ ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్, 8 ఎంపీ అల్ట్రావైడ్ లెన్స్ కెమెరాలు ఉన్నాయి. అలాగే ముందువైపు సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 50 ఎంపీ కెమెరాతో వస్తుంది. ఈ ఫోన్‌లో ‘ఆరా రింగ్ లైట్’ ఆకట్టుకుంటుంది.