Walking trees -నడిచే చెట్లను ఎప్పుడైనా చూశారా?.చెట్లేంటీ.. నడవడమేంటీ? అని ఆశ్చర్యపోకండి. నిజంగా ఈ చెట్లు నడుస్తాయి..నడిచే చెట్టు లోగుట్టు….

చెట్లేంటీ.. నడవడమేంటీ? అని ఆశ్చర్యపోకండి. నిజంగా ఈ చెట్లు నడుస్తాయి. వీటిని ఓ చోట నాటారనుకోండి.. కొన్నాళ్ళ తర్వాత అవి వేరే చోట ఉంటాయి. వీటిపేరే సొక్రాటియా ఎక్సోర్హిజా. ఎక్సో అంటే అవుట్, ర్హిజా అంటే రూట్స్.. బయటకు కనిపించే వేర్ల వల్లే చెట్లకు ఆ పేరు వచ్చింది. ఆ చెట్టును ఓ చోటనాటి కొన్నాళ్ల తర్వాత చూస్తే ఆ చెట్టు అక్కడుండదు. కొంచెం ముందుకో, వెనక్కో, పక్కకో జరిగిపోతుంది. అందుకే ఆ చెట్టును వాకింగ్ పామ్ అని కూడా పిలుస్తారు. ఇవి దక్షిణ అమెరికా, బొలీవియా, బ్రెజిల్, కొలంబియా, పెరూల్లో ఎక్కువగా కనిపిస్తాయి. వాకింగ్ పామ్ నడవటానికి కారణం.. దాని వేర్లు. ఈ చెట్టు ఆకులు సూర్యకాంతిలో పెరుగుతాయి. దట్టమైన అడవుల్లో సూర్యరశ్మి తక్కువగా పడుతుంది.
ఆ సమయంలో చెట్టు వేర్లతో నెమ్మదిగా నడిచేస్తుంది. చెట్టు కాండం కింద పొడవైన వేర్లు ఉంటాయి. చూడ్డానికి ట్రైపాడ్‌లా ఉంటాయవి. ఇవే చెట్టు కదిలేలా చేస్తాయి.

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

బయటకు ఉన్న వేర్లు కొంచెం పక్కకు నాటుకుంటాయి. అవి పాతుకున్నాక ఇది వరకటి వేర్లను క్రమంగా వదిలించేసుకుంటాయి. మళ్లీ కొత్తవి నాటుకుంటాయి. ఆ తర్వాత పాత వేర్లను వదిలేస్తాయి. ఇలా కొంచెం కొంచెంగా ముందుకో, పక్కకో కదులుతుంది. ఇదంతా చాలా మెల్లగా జరుగుతుంది.