తక్కువ బడ్జెట్లో మంచి ఫీచర్లు కలిగి మంచి మైలేజ్ ఇచ్చే కార్లు చాలా తక్కువగా ఉంటాయి. అలాంటి కార్లలో మారుతీ సుజుకి బలేనో కచ్చితంగా ఉంటుంది. ఇండియాలో ఎక్కువగా అమ్ముడైన టాప్ 10 కార్లలో కూడా బలేనో కార్ కచ్చితంగా ఉంటుంది. ఎందుకంటే దీనికి అంత క్రేజ్ ఎక్కువ. బలేనో మారుతీ సుజుకి కంపెనీ నుంచి వచ్చి బెస్ట్ అండ్ టాప్ సెల్లింగ్ కార్లలో ఒకటి. ఇది చూడ్డానికి చాలా స్టైలిష్ గా ఉంటుంది. అంతకంటే మంచి మైలేజీని, ఫీచర్లని ఇస్తుంది. పైగా 6 లక్షల రేంజిలో ఈ కార్ వస్తుంది. ఇక ఈ కార్ ని ఎందుకు కొనొచ్చు? దీని ఫీచర్లు ఏంటి? పూర్తి వివరాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.
మారుతీ సుజుకి బలేనో కారులో 5 మంది ఎంతో సౌకర్యవంతంగా కూర్చోవచ్చు. ట్రిప్స్ కి వెళ్ళినప్పుడు ఈ కారులో ఎటువంటి ఇబ్బంది లేకుండా సాఫీగా ప్రయాణించవచ్చు. ఇందులో ఎక్కువ లగేజీని తీసుకెళ్లడానికి వీలుగా మంచి బూట్ స్పేస్ కూడా ఉంటుంది. ఇది 318 లీటర్లు ఉంటుంది. పైగా ఈ కారు చూడటానికి మంచి ప్రీమియం లుక్ తో అందంగా ఉంటుంది. అందుకే ఈ కార్ అమ్మకాలలో బాగా దూసుకుపోతుంది.ఈ కారులో ఎన్నో అప్డేటెడ్ ఫీచర్లు ఉన్నాయి. ఈ కార్ 9 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, ఆపిల్ కార్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్/స్టాప్, కీలెస్ ఎంట్రీ వంటి ఫీచర్లతో వస్తుంది.
ఈ కారులో మంచి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఇందులో యాక్సిడెంట్ల నుంచి కాపాడేందుకు మొత్తం ఆరు ఎయిర్ బ్యాగ్స్ ఉంటాయి. అలాగే ఇబిడి (ఎలక్ట్రానిక్ బ్రేక్ ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్), ఎబిఎస్ (యాంటిలాక్ బ్రేకింగ్ సిస్టమ్), ఇఎస్‌పీ (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), హిల్ హోల్డ్ అసిస్ట్, 3-పాయింట్ సీట్ బెల్ట్స్, రియర్ పార్కింగ్ సెన్సార్స్ ఇంకా 360 డిగ్రీల కెమెరా వంటి సేఫ్టీ ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ కారు పెట్రోల్ వేరియంట్ 22.35 నుంచి మైలేజీని ఇస్తుంది. సీఎన్‌జీ వేరియంట్ 30.61 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. సీఎన్‌జీ వేరియంట్ కేవలం మాన్యూవల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్‌లో మాత్రమే వస్తుంది. దీని ధర రూ. 6.66 లక్షల నుంచి 9.83 లక్షల దాకా ఉంటుంది.