దీపావళి పండుగ కాంతి, ఆనందంతో నిండి ఉంటుంది. ఈ సంవత్సరం దీపావళి పండుగను అక్టోబర్ 20వ తేదీ సోమవారం జరుపుకుంటారు. ప్రతి ఒక్కరూ ఈ ప్రత్యేక పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకుంటారు.
ఇళ్లను ఎంతో కలర్ ఫుల్‌గా రంగోలితో అలకరించి, దీపాలు వెలిగిస్తారు. అయితే, ఈ సంవత్సరం దీపావళిని వేరే చోట జరుపుకోవాలని ట్రిప్ ప్లాన్ చేస్తున్నారా? దేశంలో దీపావళిని ఘనంగా జరుపుకునే రాష్ట్రాలు, నగరాలు చాలా ఉన్నాయి. దీపావళి పండుగను ప్రత్యేకమైన ఆకర్షణతో జరుపుకునే నగరాల గురించి తెలుసుకుందాం.. మీరు ఫ్యామిలీతో కలిసి ఈ నగరాలకు ట్రిప్ వెళ్లి బాగా ఎంజాయి చేయవచ్చు.
అయోధ్య
ఉత్తరప్రదేశ్‌లోని అయోధ్యలో దీపావళిని ఎంతో వైభవంగా జరుపుకుంటారు. అయోధ్య శ్రీరాముడి జన్మస్థలం. అందువల్ల, అక్కడ దీపావళిని ఒక ప్రత్యేకమైన ఉత్సాహంతో జరుపుకుంటారు. రామాలయంలో దాదాపు 1,00,000 దీపాలు వెలిగిస్తారు. నగరమంతా దీపాలతో కలకలలాడనుంది. కాబట్టి ఈసారి మీరు కూడా అయోధ్యకు వెళ్లి ఈ అందమైన దృశ్యాన్ని వీక్షించవచ్చు.
జైపూర్
రాజస్థాన్‌లోని జైపూర్‌లో కూడా దీపావళిని ఘనంగా జరుపుకుంటారు. జైపూర్‌లోని ప్రతి మూలలోనూ దీపావళి వేడుకలు జరుగుతాయి. చారిత్రక ప్రదేశాలను కూడా విలాసవంతంగా అలంకరించి, వాటి అందాన్ని పెంచుతారు. దీపావళి సమయంలో హవా మహల్, సిటీ ప్యాలెస్, అమెర్ కోటను సందర్శించడం వల్ల మీరు అద్భుతమైన దృశ్యాలు చూడవచ్చు.
గుజరాత్
గుజరాత్‌లో దీపావళి కూడా చాలా ప్రత్యేకమైనది. గుజరాత్‌లో, దీపావళి తర్వాత రోజును బెస్తు వర్షగా జరుపుకుంటారు, ఇది వ్యాపారులకు కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభాన్ని కూడా సూచిస్తుంది. ఇంకా, గుజరాత్ దీపాలతో ప్రకాశిస్తుంది.
ముంబై
ముంబైలో కూడా దీపావళిని ఘనంగా జరుపుకుంటారు, ఇక్కడ నగరమంతా దీపాల వెలుగులు, పండుగ సందడితో నిండి ఉంటుంది. మెరైన్ డ్రైవ్ వంటి ప్రదేశాలలో ఆకాశంలో పటాకుల వెలుగులు కనువిందు చేస్తాయి, అదే సమయంలో ప్రజలు దీపాలు వెలిగించి, ఇళ్లను అలంకరించి, స్వీట్లు పంచుకుంటూ సంప్రదాయ పద్ధతులలో పండుగను జరుపుకుంటారు.
గోవా
గోవాలో దీపావళిని సాంప్రదాయ పద్ధతులతో ఘనంగా జరుపుకుంటారు. గోవాలో, నరకాసురుడిని శ్రీకృష్ణుడు ఓడించిన సందర్భంగా అతని దిష్టిబొమ్మలను దహనం చేస్తారు, ఇది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక. అలాగే, అందంగా అలంకరించిన కాళీ పాండల్స్, ఆలయాలు, బాణాసంచా కాల్చడం, పండుగ భోజనాలు, బీచ్ లలో వేడుకలు ప్రత్యేక ఆకర్షణగా ఉంటాయి.
































