చాలా మంది కూడా రక రకాల లోన్లు తీసుకుంటారు. వ్యాపారం కోసమో, కార్ కొనడానికో లేదా ఇల్లు కొనేందుకో లోన్లు తీసుకుంటారు. అయితే అన్నిటికంటే కూడా ఎక్కువగా హోమ్ లోన్ తీసుకుంటారు చాలా మంది. సొంతగా ఇల్లు కట్టుకోవడం ప్రతి మధ్యతరగతి వ్యక్తి కల. ఆ కల సాకారం కావాలంటే వారికి ఈజీగా దొరికే మార్గం బ్యాంక్ లోన్. కాబట్టి అందువల్ల చాలా మంది కూడా బ్యాంక్ లోన్ తీసుకొని ఇల్లు కొనుగోలు చేస్తారు. లేదా కొత్త ఇల్లు కట్టుకుంటారు. కానీ ఆ లోన్ ని తిరిగి కట్టాలంటే చుక్కలు కనిపిస్తాయి. మనం సంపాదించే సంపాదనలో సగం అంతా బ్యాంక్ EMI లకే పోతుంది. మనం తీసుకునే లోన్ పై వడ్డీతో కలిపి రెట్టింపు డబ్బులు చెల్లించాల్సి వస్తుంది. నెల నెల సులభంగా వాయిదాలు కట్టుకోవచ్చులే.. టెన్యూర్ ఎక్కువగా ఉంది కదా అని అనుకోని.. ఈజీగా హోమ్ లోన్ తీసుకుంటారు. కానీ తరువాత రెట్టింపు నష్టాలు ఎదురుకుంటారు. మనలో చాలా మంది కూడా హోమ్ లోన్ తీసుకొని లక్షల్లో నష్టపోతున్నారు. కాబట్టి హోమ్ లోన్ తీసుకునే ముందు కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి? లేదంటే చాలా దారుణంగా నష్టపోతారు? అసలు ఇంతకీ ఆ విషయాలు ఏంటి ? మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం.
రూల్ నెంబర్ 1.. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి. మనం ఇల్లు కొనాలన్నా లేదా కట్టుకోవాలన్నా ఆ ఇంటికి తీసుకోవలసిన లోన్ మన సంవత్సర ఆదాయం కంటే 5 రెట్లు మాత్రమే ఎక్కువ ఉండాలి. అంతకంటే ఎక్కువ దాటకూడదు. ఉదాహరణకు మీ సంవత్సర ఆదాయం 7 లక్షలు అనుకుందాం. అప్పుడు మీరు తీసుకోవాల్సిన లోన్ మీ ఆదాయం మీద 5 టైమ్స్ అంటే 7 లక్షలు*5 రెట్లు = 35 లక్షలు మాత్రమే ఉండాలి. అంతకంటే తక్కువున్నా పర్లేదు కానీ ఎక్కువ కాకుండా మాత్రం చూసుకోండి. అంటే మీరు సంవత్సరానికి 7 లక్షల ఆదాయం సంపాదిస్తే 35 లక్షల దాకా మాత్రమే హోమ్ లోన్ తీసుకోండి. అలా మీ సంవత్సర ఆదాయం ఎంతైనా కానీ దానికి 5 టైమ్స్ మించి హోమ్ లోన్ తీసుకోకూడదు.
రూల్ నెంబర్ 2.. మీరెప్పుడైనా కూడా హోమ్ లోన్ తీసుకునేముందు మీ మిగతా EMI లు ఏమైనా ఉంటే వాటిని క్లియర్ చేసుకోండి. లేదా మీ నెల జీతంలో కేవలం 50 పర్సెంట్ కంటే తక్కువ EMI లు ఉండేలా ప్లాన్ చేసుకోండి. ఉదాహరణకు మీ జీతం లక్ష అయితే అందులో హోమ్ లోన్ తో కలిపి మీ EMI ఖర్చులన్నీ కూడా 50 వేలు దాటకూడదు. అంటే EMI లన్నీ పోగా మీకు మీ సగం జీతం మిగలాలి. అంత సంపాదన ఉంటే మాత్రమే హోమ్ లోన్ తీసుకోండి. బ్యాంకులు కూడా మీ మిగతా EMI లు తక్కువుంటే మాత్రమే మీకు హోమ్ లోన్ ఇస్తాయి. కాబట్టి మీ మిగతా లోన్ లు క్లియర్ చేసుకొని హోమ్ లోన్ తీసుకుంటే చాలా బెటర్.
రూల్ నెంబర్ 3.. మంచి సిబిల్ స్కోర్ ఉంటేనే లోన్ తీసుకోండి. సిబిల్ స్కోర్ 750 పైగా ఉంటేనే లోన్ తీసుకోవడం మంచిది. ఎందుకంటే మీకు మీరు తీసుకునే లోన్ పై వడ్డీ తక్కువ పడుతుంది. 800, 900 అలా సిబిల్ స్కోర్ ఉంటే మీకు తక్కువ వడ్డీకే హోమ్ లోన్ వస్తుంది. హోమ్ లోన్ 1 పర్సెంట్ తగ్గినా కూడా మీరు లక్షలు ఆదా చేసుకోవచ్చు.
రూల్ నెంబర్ 4.. చాలా మంది కూడా నెలకు EMI తక్కువ పడుతుందని లోన్ టెన్యూర్ ఎక్కువ పెట్టుకుంటారు. మీరు హోమ్ లోన్ ని 10 సంవత్సరాల లోపు తీర్చుకునే ఆదాయం ఉంటే మాత్రమే తీసుకోండి. చాలా మంది 20 సంవత్సరాలకు పైగా లోన్ టెన్యూర్ పెట్టుకుంటారు. కొంతమంది 30 సంవత్సరాలు, 40 సంవత్సరాలు ఇలా లోన్ టెన్యూర్ పెట్టుకుంటారు. ఇలా అయితే మీ జీవితం మొత్తం మీరు సంపాదించిన సంపాదన అంతా కూడా లోన్ కే పోతుంది. ఎక్కువ సంవత్సరాలు EMI కట్టడం వల్ల మీరు ఎక్కువ వడ్డీ కట్టాల్సి వస్తుంది. తక్కువ సంవత్సరాలు కట్టడం వల్ల తక్కువ వడ్డీ పడుతుంది. కాబట్టి లోన్ టెన్యూర్ తక్కువ వుండేలా ప్లాన్ చేసుకోండి. కాకుంటే లోన్ టెన్యూర్ తక్కువ ఉన్నప్పుడు మీరు నెలకు ఎక్కువ EMI కట్టాల్సి వస్తుంది. అలా కట్టే సంపాదన ఉంటే మాత్రమే హోమ్ లోన్ కి అప్లై చేసుకోండి.
రూల్ నెంబర్ 5.. మీరు హోమ్ తీసుకోవాలనుకుంటే అందులో కచ్చితంగా 20 పర్సెంట్ డౌన్ పేమెంట్ కట్టుకునేలా ప్లాన్ చేసుకోండి. అంటే మీరు ఒక 10 లక్షలు లోన్ తీసుకుంటే అందులో 2 లక్షలు డౌన్ పేమెంట్ కట్టగలగాలి. అది కూడా మీరు ఎక్కడా అప్పు చేయకుండా మీ సొంత సేవింగ్స్ తో కట్టుకునేలా ఉండాలి. ఇలా మీరు లోన్ తీసుకునేముందు ఈ విషయాలు తెలుసుకోవాలి. అప్పుడే మీకు హోమ్ లోన్ తీర్చుకోవడం ఈజీ అవుతుంది. చాలా తక్కువ వడ్డీతో హోమ్ లోన్ క్లియర్ అవుతుంది.