పాన్ కార్డు ఉన్నవాళ్లకి హెచ్చరిక.. ఇలా చేయకపోతే.. కార్డు పనిచేయదు

ప్రభుత్వం పాన్ కార్డు ఉన్నవారికి హెచ్చరిక జారీ చేసింది. ఈ క్రమంలో సిబిడిటి ఒక కీలక ప్రకటన చేసింది. ఇప్పటివరకు పూర్తి చేయని వాళ్ళు వెంటనే ఇది పూర్తి చేయాలని వెల్లడించింది. లేదా వాళ్లకు భారీ పెనాల్టీ పడుతుంది. ప్రతి వ్యక్తి ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ లో సాఫీగా సాగాలంటే పాన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. చాలా కాలం క్రితమే పాన్ కార్డును ఆధార్ కార్డుతో లింకు చేయాలని నిబంధన అమలులోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ చాలామంది ఇప్పటివరకు ఆ ప్రక్రియను పూర్తి చేయలేదు. తాజాగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఈ ప్రక్రియను పూర్తి చేయని వాళ్లకోసం కొత్త గడువును విధించింది. ప్రకారం చాలామంది తమ ఆధార్ నెంబరును ఇన్కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ చేయాలి.


కొత్త గడువులోగా ఈ ప్రక్రియ పూర్తి చేయకపోతే ఎలాంటి సమస్యలు వస్తాయో ఇప్పుడు తెలుసుకుందాం. ఆధార్ నెంబర్ ను డిసెంబర్ 31, 2025 లోపు పాన్ కార్డుకి లింక్ చేయకపోతే పాన్ కార్డు ఇన్ ఆపరేటివ్ అవుతుంది. అంటే జనవరి 1, 2026 తర్వాత మీ పాన్ కార్డు పనిచేయదు. ఆ తర్వాత మీరు ఐటిఆర్ ఫైల్ చేయడం అలాగే రిఫరెన్స్ క్లైమ్ చేయడం వంటివి కుదరదు. మీకు టీడీఎస్, టిసిఎస్ రేట్లు ఎక్కువగా కట్ చేస్తారు. అలాగే మీరు ఫారం 15 జి, 15 హెచ్ పాములను సబ్మిట్ చేసే అవకాశం కూడా ఉండదు. ఫారం 26 ఏఎస్ లో టిడిఎస్ క్రెడిట్ కూడా కనిపించదు. రిఫండ్ పై మీకు వడ్డీ కూడా రాదు. కాబట్టి గడువు తేదీలోపు మీరు ఆధార్ నెంబర్ను సమర్పించడం చాలా ముఖ్యం. అక్టోబర్ 1 2024 కంటే ముందు ఆధార్ ఎన్రోల్మెంట్ ఐడి తో పాన్ కార్డు తీసుకున్న వాళ్లు ఈ నోటిఫికేషన్ పరిధిలోకి వస్తారని అధికారులు తెలిపారు. వీళ్ళందరూ కూడా డిసెంబర్ 31, 2025 లోపు ఒరిజినల్ ఆధార్ నెంబర్ ను పాన్ కార్డుకు లింక్ చేయాలి.