ఈ రోజుల్లో వాషింగ్ మిషన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది.
పల్లెల నుంచి నగరాల వరకు అనేక ఇళ్లలో వాషింగ్ మిషన్లు దర్శనమిస్తున్నాయి. ఈ ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతీ ఒక్కరూ.. వారి ఆర్ధిక పరిస్థితికి అనుగుణంగా తగిన వాషింగ్ మిషన్లను కొనుగోలు చేసి వాడుతున్నారు.
అయితే.. వాషింగ్ మిషన్లలో బట్టలు వేస్తే నిమిషాల్లో శుభ్రం అవుతాయన్న విషయం తెలిసిందే. అయితే.. ఇటీవలి కాలంలో వాషింగ్ మిషన్లు బాంబుల మాదిరిగా పేలుతున్నాయన్న వార్తలు అనేకంగా వినిపిస్తున్నాయి. దీంతో ప్రాణాలు పోయిన ఘటనలు కూడా ఉన్నాయి.
ఇటీవల లక్నోలో ఓ మహిళ వాషింగ్ మిషన్ వినియోగిస్తున్న సమయంలో షాక్ కు గురై ప్రాణాలు వదిలింది. అయితే.. వాషింగ్ మిషన్ ను వినియోగిస్తున్న సమయంలో ప్రమాదాలు జరగకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న విషయంపై అనేక మందికి అవగాహన ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు.
కొన్ని చిట్కాలను పాటిస్తే.. ప్రమాదాలు జరగవని చెబుతున్నారు. వారు ఏమంటున్నారో చూద్దాం. వాషింగ్ మెషీన్ను ఉపయోగించడం చాలా సులభం, కానీ కొన్నిసార్లు వాషింగ్ మెషీన్ను ఉపయోగిస్తున్నప్పుడు అజాగ్రత్త ప్రాణాంతకం కావచ్చు.
మనలో చాలా మంది తమలో ఓ చిన్న ఎలక్ట్రీషియన్ ఉన్నాడని భావిస్తూ ఉంటారు. ప్లగ్ లు ఫిట్ చేయడం లాంటి పనులను చిటికెలో చేస్తామన్న ధీమా ఉంటుంది. అయితే.. వాషింగ్ మిషన్లు, రిఫ్రిజిరేటర్లు లాంటి సున్నితమైన వస్తువులను రిపేర్ చేయడంలో వేలు పెట్టకపోవడమే మంచిది.
ముఖ్యంగా వాషింగ్ మిషన్లకు సంబంధించిన వైర్లు ఏమైనా తెగినట్లు గుర్తిస్తే వెంటనే సంబంధిత టెక్నీషియన్ ను పిలిపించండి. ఇంకా ఎప్పటికప్పుడు ప్లగ్ కు సంబంధించిన వైర్లను చెక్ చేయండి. ఏమైనా తెగినట్లు అనిపిస్తే.. వెంటనే మార్పించండి. లేకపోతే.. వాషింగ్ మెషీన్‌లో విద్యుదాఘాతానికి గురయ్యే అవకాశాలు పెరుగుతాయి.
వాషింగ్ మెషిష్ ను ఉపయోగిస్తున్నప్పుడు నీరు నీరు నియంత్రణ ప్యానెల్‌పై పడకూడదు. యంత్రాన్ని నియంత్రించే బటన్‌పై చాలాసార్లు నీరు పడుతూ ఉంటుంది. ఈ అంశంపై శ్రద్ధ చూపకపోతే ప్రమాదాలు చోటు చేసుకుంటాయి.
వాషింగ్ మెషిన్ ను ఎల్లప్పుడూ అనుభవజ్ఞుడైన సాంకేతిక నిపుణుడితోనే రిపేర్ చేయించాలి. అనుభవం లేని సాంకేతిక నిపుణులు కొన్నిసార్లు యంత్రం లోపల వైర్లకు టేప్ చేయడం మర్చిపోతారు.
అలాగే కొన్నిసార్లు మోటార్ స్క్రూలు సరిగ్గా బిగించడం మర్చిపోతారు. అటువంటి పరిస్థితిలో.. వాషింగ్ మెషిన్ ను ఉపయోగిస్తున్నప్పుడు ప్రమాదం పెరుగుతుంది.
ఇంకా వాషింగ్ మిషన్ ను క్రమం తప్పకుండా.. సర్వీసింగ్ చేయిస్తూ ఉండండి. తద్వారా చిన్న చిన్న రిపేర్లు పెద్దవిగా కాకముందే సమస్యను పరిష్కరించవచ్చు.