వాషింగ్‌ మెషిన్‌ను ఇలా కూడా వాడుతారా? వైరల్

ఓ మహిళ చేసిన పనికి నెటిజన్లు అవాక్కయ్యారు. బట్టలు ఉతకాల్సిన (washing machine) వాషింగ్ మెషిన్‌లో అలుగడ్డల(బంగాళాదుంపలు)ను క్లీన్ చేసింది. తొక్కలు లేకుండా ఫ్రెష్‌గా వాటిని బయటకు తీసిన వీడియో తాజాగా నెట్టింట వైరల్‌గా మారింది. మనం సాధారణంగా అలుగడ్డలపై తొక్క తీయాలంటే పీలర్‌ పరికరాన్ని వాడుతాము. లేదంటే ఆలుగడ్డలు ఉడకబెడితే సులభంగా చేతులతో తొక్క తీస్తుంటాము. కానీ ఇక్కడ మహిళ మాత్రం అందుకు భిన్నంగా తొక్కలు తీయడానికి వాషింగ్ మెషిన్‌ను ఉపయోగించింది. వీడియోలో చూపించిన ప్రకారం.. ఓ మహిళా వాషింగ్ మెషిన్ వద్దకు పెద్ద సైజు గిన్నెలో ఆలుగడ్డలు వేసుకొని వస్తుంది. తర్వాత వాషింగ్ మెషిన్‌తో ఆలుగడ్డలను ఒకే సారి వేసి స్విచ్ అన్ చేస్తుంది.


ఇక వాషింగ్ మెషిన్ దాని పని అది చేస్తుంది. కొద్ది సేపటి వరకు అవి బట్టల మాదిరి మెషిన్‌లో అలుగడ్డలు గిరగిర తిరుగుతాయి. తర్వాత స్విచ్ ఆఫ్ చేసి వాటిని బయటకు తీయగా తొక్కతిసినా వాటిలేక్క నీట్‌గా అవి ఉంటాయి. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. నెటిజన్లు రకరకాలుగా కామెంట్స్ పెడుతున్నారు. ఎందక్కా.. నీలో మరీ ఇంత క్రియేటివిటి ఉంది.. వాషింగ్‌ మెషిన్‌ను ఇలా కూడా వాడుతారా? అని నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు. నెక్స్ టైమ్ ఆలుగడ్డలు వాషింగ్ చేసేటప్పుడు డిటర్‌జెంట్ పౌడర్ బదులు, మసాలాలు వేయాలని ఓ నెటిజన్ ఫన్నీ కామెంట్ పెట్టారు.

అయితే, ఇది ఫేక్ వీడియో అని, కావాలని ఇలా ఎడిట్ చేసి ఉంటారని చాలా మంది నెటిజన్లు కామెంట్ రూపంలో తెలియజేశారు. ఎందుకంటే వాషింగ్ మెషిన్‌లో ఇలాంటివి వేస్తే శుభ్రం అవ్వుడు పక్కకు పెడితే.. అవి ముక్కలు ముక్కలు అయ్యి పనికి రాకుండా పోతాయని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. ఇలాంటివి ఎవరు ట్రై చేయవద్దని సూచనలు చేస్తున్నారు.