థ్రిల్లర్ మూవీస్ చూడడం మీకు ఇష్టమా.. ? భయపడినా హారర్ లను చూసేందుకు మీరు ఇష్టపడుతుంటారా.. ? అయితే మీకోసం ఇప్పుడు ఓటీటీ ప్లాట్ ఫామ్స్ థ్రిల్లర్ మూవీస్ తీసుకువస్తున్నాయి.
తెలుగుతోపాటు ఇతర భాషలలో సూపర్ హిట్ అయినా హరర్ చిత్రాలను స్ట్రీమింగ్ చేస్తున్నాయి. హాలీవుడ్ లకు ప్రపంచవ్యాప్తంగా మంచి ఆదరణ లభిస్తుందన్న సంగతి తెలిసిందే. అందుకే ఇప్పుడు ప్రేక్షకులను అలరించేందుకు ఇప్పుడు హాలీవుడ్ మూవీని స్ట్రీమింగ్ చేస్తున్నారు. అందుకే క్షణక్షణం సాగే హారర్ థ్రిల్లర్‌పై ఓ లుక్కేద్దాం. టాలీవుడ్ అడియన్స్ లవ్ స్టోరీ, ఫ్యామిలీ ఎంటర్టైనర్స్ కాకుండా హాలీవుడ్ థ్రిల్లర్లను ఇష్టపడతారు. హారర్ లో తదుపరి సన్నివేశం ఎలా ఉంటుందో చూద్దాం.
“ది డెడ్ రూమ్” .. ఒక గదిలో ఉన్న దెయ్యం బారి నుంచి ముగ్గురు వ్యక్తులు ఎలా తప్పించుకుంటుంది అనేదే కథాంశం . ఇది 2015లో విడుదలైన ఈ హాలీవుడ్ హారర్ . జాసన్ స్టట్టర్ దర్శకత్వంలో న్యూజిలాండ్‌లో విడుదలైన థ్రిల్లర్ భారీ విజయాన్ని అందుకుంది. సెంట్రల్ ఒటాగోలోని 1970ల నాటి ఫామ్‌హౌస్‌లో జరిగిన నిజమైన కథ ఆధారంగా ఈ ను రూపొందించారు. ఆ యదార్థ సంఘటనను ప్రెజెంట్ చేస్తూ ముగ్గురు వ్యక్తుల బృందంతో హౌస్‌లోని దెయ్యాన్ని ఎలా ఎదుర్కొన్నారనే కథను దర్శకుడు చాలా అందంగా చెప్పాడు.
ది చాలా థ్రిల్లర్, సస్పెన్స్ అంశాలతో కూడిన ఈ హారర్ చిత్రం సినీ ప్రియులను ఆకట్టుకుంటుంది. ముగ్గురు వ్యక్తులు దెయ్యం ఉన్న రహస్య గదిలో నుంచి ఎలా తప్పించుకున్నారు అనేది కథ. ఈ డెడ్ రూమ్ చూస్తే కచ్చితంగా మరణ భయం అంటే ఏంటో తెలుస్తుందని నెటిజన్స్ అభిప్రాయపడుతున్నారు. అందుకే ఈ చిత్రాన్ని ఒక్కసారైనా తప్పక చూడాలంటూ కామెంట్స్ చేశారు.