Watch Video: విడాకుల ఆహ్వానం.. అత్తారింటికి వీడ్కోలు..! భారీ హంగామాతో పుట్టింటికి కూతురు..

2019 సంవత్సరంలో ఉర్వి ఒక కుమార్తెకు జన్మనిచ్చింది. కూతురు పుట్టిన తర్వాత ఉర్వికి మరిన్ని అవహేళనలు మొదలయ్యాయి. క్రమంగా అత్తమామల ప్రవర్తనలో మార్పు రావడంతో ఆశిష్ కూడా పుట్టిన బిడ్డను కూడా పట్టించుకోకుండా ఉర్వికి దూరంగా ఉండటం మొదలుపట్టాడు. ఆ తర్వాత భార్యాభర్తలు విడివిడిగా జీవించడం ప్రారంభించారు. దూరం పెరిగిపోవడంతో కోర్టులో విడాకుల కోసం దరఖాస్తు చేసుకున్నారు.
పెళ్లంటే అంత ఆశామాశీ వ్యవహారం కాదు. ఇరు కుటుంబాలు అటు ఏడు తరాలు.. ఇటు ఏడు తరాలు చూసుకొని తమ అంతస్థుకు తగిన వారిని ఎంచుకుంటారు. ఇద్దరు మనుషులను ఒక్కటి చేసే బంధం రెండు కుటుంబాలను కలిపేలా ఉండేందుకు ఆచీ తూచీ నిర్ణయాలు తీసుకుంటారు. వేద మంత్రాల సాక్షిగా మూడు ముళ్ల బంధంతో ఒక్కటైన ఆ జంటను నిండు నూరేళ్లు కలిసిమెలిసి జీవించాలని దీవిస్తారు. కానీ, ఇటీవలి కాలంలో పెళ్లి అనే మాటకు అర్థాలు మార్చేస్తున్నారు కొందరు. చాలా జంటలు పెళ్లైన కొంత కాలానికే వివిధ కారణాల వల్ల విడాకులు తీసుకుంటున్నారు. తాజాగా అలాంటి ఘటనే ఒకటి ఉత్తర్ ప్రదేశ్‌లో చోటు చేసుకుంది. అయితే, విడాకులు తీసుకున్న తన కూతురిని ఆ తల్లిదండ్రులు ఆదరించిన తీరు మాత్రం సర్వత్రా చర్చనీయాంశంగా, అందరి ప్రశంసలు అందుకునేదిగా ఉంది. భర్తతో విడాకులు తీసుకున్న తన కూతుర్ని బ్యాండ్ భాజాలతో తమ ఇంటికి తీసుకువచ్చాడు ఓ తండ్రి. విరాల్లోకి వెళితే..

WhatsApp Channel Join Now
Telegram Channel Join Now
Google News Join Now
Facebook Page Join Now

ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లోని నిరాలా నగర్‌కు చెందిన అనిల్-సవిత దంపతుల ఏకైక కుమార్తె ఉర్విని, ఆశిష్ రంజన్ అనే వ్యక్తితో 2016లో వివాహం జరిపించారు. వీరి వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఉర్వి ఇంజనీర్, ఆమె భర్త ఆశిష్ కూడా ఇంజనీరే. ఉర్వి ఢిల్లీలోని పాలం ఎయిర్‌పోర్ట్‌లో పనిచేస్తున్నారు. వివాహం తర్వాత ఇద్దరూ ఢిల్లీలో నివసిస్తున్నారు. కొంతకాలం వీరి కాపురం సాఫీగానే సాగింది. ఇంతలో, 2019 సంవత్సరంలో వీరికి ఒక కూతురు పుట్టింది. పాప పుట్టిన తర్వాత ఉర్వికి మరిన్ని కష్టాలు, అవహేళనలు మొదలయ్యాయి. క్రమంగా అత్తమామల ప్రవర్తనలో మార్పు రావడంతో ఆశిష్ పుట్టిన బిడ్డను కూడా పట్టించుకోకుండా ఉర్వికి దూరంగా ఉండటం మొదలుపట్టాడు. ఆ తర్వాత భార్యాభర్తలు విడివిడిగా జీవించసాగారు. దీంతో విసిగిపోయిన ఉర్వీ భర్త నుంచి విడాకులు కోరింది. ఫిబ్రవరి 28న వారిద్దరూ విడాకులు తీసుకున్నారు.

ఈ విషయంతో ఉర్వి తల్లిండ్రులు ఆమెకు బాసటగా నిలబడ్డారు. పెళ్లి సమయంలో ఎలాగైతే తమ కూతుర్ని అత్త వారింటికి భాజా భజంత్రీలతో పంపించారో.. విడాకులు తీసుకున్న తర్వాత కూడా అలాగే తమ ఇంటికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు ఆ తండ్రి. తమ కుమార్తెను తిరిగి తీసుకురావడానికి డప్పు వాయిద్యాలతో పెళ్లి ఊరేగింపులా ఉర్వి అత్తమామల ఇంటికి చేరుకున్నారు. అత్తారింటితో వీడ్కోలు చెబుతూ ఘనంగా పుట్టింటికి ఆహ్వానం పలికారు. ప్రస్తుతం ఈ విషయం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. దీనికి సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Related News

Related News

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *