నీటిలో పడినా డ్యామేజీ కానీ 5G స్మార్ట్‌ఫోన్‌ ధర రూ.11998.. 6000mAh బ్యాటరీ, 50MP కెమెరా.

రియల్‌మి నార్జో 80 సిరీస్‌లో భాగంగా ఈ సంవత్సరం ఏప్రిల్‌లో నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల అయింది. స్లిమ్ డిజైన్‌లో ఈ హ్యాండ్‌సెట్‌ అందుబాటులోకి వచ్చింది.


మరియు IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్ రెసిస్టెంట్‌గా ఉంది. దీంతోపాటు ఈ ఫోన్ 6000mAh భారీ బ్యాటరీని కలిగి ఉంది. ప్రస్తుతం ఈ ఫోన్‌ను డిస్కౌంట్‌ ధరకు కొనుగోలు చేయవచ్చు. ఈ రియల్‌మి హ్యాండ్‌సెట్‌ స్పెసిఫికేషన్లు, ఫీచర్ల పూర్తి వివరాలు.

రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల సమయంలో 6GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.13999, 8GB ర్యామ్ + 128GB స్టోరేజీ ధర రూ.14999 గా ఉండేది. ప్రస్తుతం అమెజాన్‌లో డిస్కౌంట్ ధరకు అందుబాటులో ఉంది. మరియు కూపన్‌ కోడ్‌ ద్వారా మరింత డిస్కౌంట్ ధరకు సొంతం చేసుకోవచ్చు.

బ్యాంకు కార్డులతో సంబంధం లేకుండా రూ.1000 డిస్కౌంట్‌ :

ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్‌ 6GB ర్యా్మ్ వేరియంట్ ధర రూ.12998 గా ఉంది. అదే 8GB ర్యామ్ వేరియంట్ ధర రూ.13998 గా ఉంది. దీంతోపాటు కూపన్‌ కోడ్ ద్వారా రూ.1000 డిస్కౌంట్‌ను పొందవచ్చు. ఫలితంగా ఈ ఫోన్‌ను రూ.11998 కే సొంతం చేసుకోవచ్చు. డీప్‌ ఓసియన్‌, సన్‌లిట్‌ గోల్డ్‌ కలర్ వేరియంట్స్‌లో లభిస్తుంది.

సూపర్‌ స్లిమ్ డిజైన్‌ :

రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్‌ 7.94mm థిక్‌నెస్‌తో సూపర్‌ స్లిమ్‌ డిజైన్‌ను కలిగి ఉంది. ఈ ఫోన్ 120Hz రీఫ్రెష్‌ రేట్‌తో 6.72 అంగుళాల FHD+ ఫ్లా్ట్‌ LCD డిస్‌ప్లేను కలిగి ఉంది. 1080 x 2400 పిక్సల్స్ రిజల్యూషన్‌, 690 నిట్స్‌ పీక్‌ బ్రైట్‌నెస్‌, 180Hz టచ్‌ శాంప్లింగ్‌ రేట్‌ను కలిగి ఉంది.

మీడియాటెక్ చిప్‌సెట్‌ :

ఈ హ్యాండ్‌సెట్‌ మీడియాటెక్‌ డైమెన్సిటీ 6400 SoC చిప్‌సెట్‌ను కలిగి ఉంది. ఈ చిప్‌సెట్ గరిష్ఠంగా 8GB LPDDR4x ర్యామ్‌, 256GB స్టోరేజీతో జతచేసి ఉంది. ఈ హ్యాండ్‌సెట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత Realme UI 6 పైన పనిచేస్తుంది. ఈ ఫోన్‌ రెండు స్టోరేజీ వేరియంట్స్‌లో అందుబాటులో ఉంది.

50MP కెమెరా, 6000mAh బ్యాటరీ :

ఈ స్మార్ట్‌ఫోన్ 45W SuperVOOC ఛార్జింగ్ సపోర్టుతో 6000mAh బ్యాటరీని కలిగి ఉంది. బడ్జెట్ రేంజ్‌లో భారీ బ్యాటరీగా గుర్తించవచ్చు. కెమెరా విభాగం పరంగా వెనుక వైపు డ్యూయల్‌ కెమెరాలను కలిగి ఉంది. 50MP ప్రైమరీ కెమెరా, 2MP సెకండరీ కెమెరాలను కలిగి ఉంది. 8MP సెల్ఫీ కెమెరాను కలిగి ఉంది.

బడ్జెట్‌ ధరలో IP69 రేటింగ్‌ :

ఈ ఫోన్ IP69 రేటింగ్‌తో డస్ట్ మరియు వాటర్‌ రెసిస్టెంట్‌గా ఉంది. ఈ ఫోన్ నీటిలో పడినా కొంత సమయం వరకు డ్యామేజీ అయ్యే అవకాశం లేదు. దీంతోపాటు ఈ ఫోన్ ఆర్మర్‌ షెల్‌ ప్రొటెక్షన్‌ను కలిగి ఉంది. దీంతోపాటు మిలిటరీ గ్రేడ్‌ షాక్ రెసిస్టెంట్‌గా ఉంది.

కనెక్టివిటీ పరంగా రియల్‌మి నార్జో 80x 5G స్మార్ట్‌ఫోన్‌ 5G, 4G LTE, వైఫై 6, బ్లూటూత్‌ 5.4, GPS, USB-C ఛార్జింగ్ పోర్టును కలిగి ఉంది. సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్‌ ప్రింట్‌ సెన్సార్‌ను కలిగి ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్ కేవలం 197 గ్రాములుగా ఉంది.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.