వారంలో ఒక్కసారి ఎక్సర్ సైజ్ చేసినా ఊహించని లాభాలు..

www.mannamweb.com


చాలా మంది డేని ఎంతో చక్కగా ప్లాన్ చేసుకుంటూ ఉంటారు. టైమ్ టూ టైమ్ మేనేజ్మెంట్ చేసుకుంటారు. ఈ సమయానికి వ్యాయామం.. ఈ సమయానికి తిండి అని టైమ్ సెట్ చేసుకుంటారు.

సరిగ్గా సమాయినికి లేస్తారు కూడా. కానీ అందరికీ అలా కుదరదు. అందులోనూ వర్క్ చేసే లేడీస్‌కి ఉదయం ఎక్సర్ సైజ్ చేయాలంటే చాలా కష్టంగా ఉంటుంది. ఇలా రోజూ వ్యాయామానికి గంట లేదా అరగంట సమయం కేటాయించాలంటే.. అస్సలు కుదరని పని. ఉదయం లేచింది మొదలు.. రాత్రి పడుకునేంత వరకు ఉరుకుల పరుగుల మీద ఉంటుంది. అయితే రోజూ ఎక్సర్ సైజ్ చేయకపోయినా.. వారంలో ఒక్కసారి చేసినా సరిపోతుందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

సమానంగా ఫలితాలు..

ఇటీవల చేసిన పలు అధ్యయానల్లో ఈ విషయం వెల్లడైంది. వారంలో ఒక్కసారి వ్యాయామం చేసినా.. వారంలో పడ్డ ఒత్తిడి, ఆందోళన దూరమై ఎంతో రిలీఫ్‌గా ఉంటుందని అన్నారు. రోజూ చేసే వ్యాయమంతో సమానంగా.. వీక్లీల ఒకసారి చేసే ఎక్సర్‌ చేసే వారిలోనూ ప్రయోజనాలు కనిపిస్తున్నాయని మసాచుసెట్స్ జనరల్ ఆస్పత్రి పరిశోధకులు గుర్తించారు.

జబ్బుల ముప్పు తక్కువగా..

వారంలో 150 నిమిషాల కన్నా తక్కువగా శ్రమ చేసే వారిని.. వ్యాయామం సరిగా చేయని వారిలో చేర్చారు. అందరిలోనూ మొత్తం 678 జబ్బుల పరిస్థితిని సమీక్షించారు. అంతగా వ్యాయామం చేయని వారితో పోలిస్తే.. రోజూ చేసే వారితో పాటు వారంతంలో ఒకసారి చేసే వారిలోనూ 200కు పైగా జబ్బుల ముప్పు తక్కువగా ఉందని వెల్లడించారు.

వారంలో ఒకసారి చేసినా లాభాలే..

రోజూ వ్యాయామం చేసే వారిలో బీపీ 28 శాతం, షుగర్ 46 శాతం ఉండగా.. వారాంతంలో చేసే వారిలో బీపీ 23 శాతం, షుగర్ 43 శాతం ముప్పు ఉందని తేల్చారు. దీని బట్టి రోజూ వ్యాయామం చేసే వారిలోనూ, వారంలో ఒకసారి చేసే వారిలోనూ ఎక్సర్ సైజ్ చేయడం వల్ల వచ్చే ప్రయోజనాలు సమానంగా ఉన్నాయని వెల్లడించారు. కాబట్టి రోజూ వ్యాయామం చేయని వారికి సమయం లేకపోయినా ఏ మాత్రం బాధ పడకుండా.. వారంలో ఒక్క రోజు అయినా ఎక్సర్ సైజ్‌కి టైమ్ కేటాయించింది.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే. )