అధిక బరువుతో బాధపడేవారు, బరువు తగ్గాలని అనుకునే వాళ్లు రకరకాల వ్యాయామాలు చేస్తారు. కఠోరమైన ఆహార నియమాలు పాటిస్తూ ఉంటారు. ఇప్పుడు చెప్పే డ్రింక్ తాగితే మంచి పలితం ఉంటుంది.
ఈ రోజుల్లో ప్రతి ఒక్కరిని వేదిస్తున్న సమస్యలలో అధిక బరువు సమస్య అనేది ఎక్కువగా ఉంది. శరీరంలో అదనంగా పెరుకుపోయిన కొవ్వును కరిగించుకొని బరువు తగ్గటానికి ఒక మంచి డ్రింక్ తెలుసుకుందాం. మందుల జోలికి వెళ్లకుండా ఈ డ్రింక్ తాగితే తప్పకుండా బరువు తగ్గటం ఖాయం. రోజులో అరగంట వ్యాయామం చేస్తూ ఈ డ్రింక్ తాగాలి.
పొయ్యి మీద గిన్నె పెట్టి గ్లాసున్నర నీటిని పోసి దానిలో ఒక స్పూన్ జీలకర్ర, ఒక స్పూన్ సొంపు, అరస్పూన్ మిరియాలు, అర చెక్క నిమ్మ కాయను ముక్కలుగా కట్ చేసి వేయాలి. 5 నుంచి 7 నిమిషాలు మరిగించి గ్లాస్ లోకి వడకట్టి ప్రతి రోజు ఉదయం సమయంలో తాగితే 15 రోజుల్లోనే తేడా కనపడుతుంది.
జీలకర్ర బరువు తగ్గించటానికి, శరీరంలో పెరుకుపోయిన కొవ్వును కరిగించటానికి చాలా అద్భుతంగా పనిచేస్తుంది. జీలకర్రలో కూడా కాల్షియం సమృద్ధిగా ఉంటుంది. జీలకర్ర ఎముకలు బలంగా ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. అందువల్ల బరువు తగ్గినప్పుడు ఎముకలు బలహీనంగా మారతాయని భయపడాల్సిన అవసరం లేదు.
జీవక్రియ రేటును బాగా పెంచుతుంది. బరువును చాలా వేగంగా తగ్గిస్తుంది. సొంపులో ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండటమే కాకుండా ఆకలి నియంత్రణలో ఉంటుంది. దాంతో బరువు తగ్గటానికి సహాయపడుతుంది. మిరియాలు,నిమ్మకాయలో ఉన్న లక్షణాలు కూడా బరువును తగ్గిస్తాయి.
ఈ డ్రింక్ తాగటం వలన శరీరంలో రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ఈ డ్రింక్ లో ఉపయోగించిన జీలకర్ర,మిరియాలు,సొంపు, నిమ్మకాయలలో ఉన్న లక్షణాలు శరీరంలో అదనంగా ఉన్న కొవ్వును కరిగించటంలో సహాయపడుతాయి. ఈ ఇంగ్రిడియన్స్ మనకు సులువుగా అందుబాటులో ఉంటాయి.
గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.
































