నెలలో 12 కేజీల బరువు తగ్గాడు..గతంలో కంటే యాక్టివ్,హ్యాండ్సమ్ గా..సాఫ్ట్ వేర్ ఉద్యోగి వెయిట్ లాస్ జర్నీ

www.mannamweb.com


అతనో సాఫ్ట్ వేర్ ఉద్యోగి.. పైగా వర్క్ ఫ్రం హోమ్. నచ్చిన ఫుడ్ తింటూ భారీగా బరువు పెరిగాడు. వారాలు, నెలలు గడుస్తున్నాయి క్రమంగా శరీరంలో మార్పులు మొదలయ్యాయి.

తరుచూ అనారోగ్యం, తలనొస్పి, టెన్షన్ ఇలా బాధపడుతూ ఉండేవాడు. అంతేకాకుండా ఇరుగుపొరుగువాళ్లు, సన్నిహితులు, బంధువులు బాగా పెరిగిన అతని పొట్ట చూసి నవ్వుకునేవాళ్లు. అయితే అప్పుడు కూడా అతను లైట్ తీసుకున్నాడు. చివరికి వర్క్ ఫ్రం హోం ఎత్తేసి ఆఫీసుకి రమ్మన్న తర్వాత నుంచి అసలు కథ మెదలైంది. సహోద్యోగులు తన రూపం చూసి నవ్వుతుండటం, డ్రెస్సింగ్ విషయంలో కూడా అనేక ఇబ్బందులు ఎదురవడంతో సీరియస్ డెసీషన్ తీసుకొని స్ట్రిక్ట్ డైట్ తో నెల రోజుల్లోనే 12 కేజీల బరువు తగ్గాడు.

ఇప్పుడు చాలా ఆరోగ్యంగా ఉండటమే కాదు బుల్ ఫైట్ కి కూడా రెడీ అంటున్నాడు. అతడే విజయేందర్ రెడ్డి. హైదరాబాద్ కి చెందిన విజయేందర్ రెడ్డి వయస్సు 34 ఏళ్లు. నెల రోజుల్లోనే బరువు గణనీయంగా తగ్గి ఎట్రాక్టివ్ గా మారిపోయిన తన వెయిట్ లాస్ జర్నీ గురించి విజయేందర్ రెడ్డి బోల్డ్ స్కై తెలుగుతో పంచుకున్నారు.

బరువు ఎంత ఉండేవాళ్లు,ఎందుకు తగ్గాలనుకున్నారు

విజయేందర్ మాటల్లో” కొన్ని నెలల క్రితం వరకు నేను 83 కేజీలు ఉండేవాడిని. అయితే వర్క్ ఫ్రం హోం అయిపోయి ఆఫీసుకి వెళ్లడం మొదలుపెట్టిన తర్వాత నా శరీర ఆకారం వల్ల నాలో కొంత సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా తగ్గింది. చుట్టుపక్కల వాళ్లు ఎగతాళి చేయడం, నా బరువు మీద జోక్స్ వేయడం చేసేవారు. మొదట్లో పెద్దగా పట్టించుకోలేదు. అయితే క్రమంగా అది మరింత ఎక్కువ అయిపోయి నేను అసలు ఎప్పటికీ బరువు తగ్గను అని అంటుంటే బాధపడేవాడిని. దీంతో ఓ రోజు కఠిన నిర్ణయం తీసుకున్నా. నోటి ఆకలి తగ్గించుకోవాలి, ఎట్టిపరిస్థితుల్లో అయినా బరువు తగ్గాలని ఓ నిర్ణయానికి వచ్చేసాను”.

ఉదయాన్నే బ్రేక్ ఫాస్ట్ లోకి ఏం తీసుకునేవాళ్లు

” ఉదయం 6 గంటలకు క్రమం తప్పకుండా నిద్ర లేచేవాడిని. లేచిన వెంటనే అరలీటర్ నుంచి 1 లీటర్ వరకు మంచినీళ్లు తాగుతాను. ప్రతి రోజూ అందరిలానే నేను కూడా బ్రేక్ ఫాస్ట్ చేస్తాను. రోజూ ఒకే రకమైన బ్రేక్ ఫాస్ట్ అని ఏమీ ప్రత్యేకంగా తినను. దోశ అయితే 1 తిని సరిపెట్టుకుంటాను. ఇడ్లీ అయితే 2 తిని బ్రేక్ ఫాస్ట్ ముగించేస్తాను. అయితే వారంలో నాలుగు రోజులు మాత్రం ఉదయం పూట ఓట్స్ తినేవాడిని. రాత్రిపూట కొంచెం పాలలో ఓట్స్,ఖర్జూరం,సన్ ప్లవర్ సీడ్స్,కాజు, బాదం,పుచ్చ గింజలు, సబ్జా గింజలు అన్నీ కలిపి 50 గ్రాములు వేసి ఉంచి ఉదయాన్నే అది తినేవాడిని. నాకు నచ్చిన అరటి లేదా మరేదైనా పండుతో ఆ ఓట్స్ మిక్స్ ని తినేవాడిని. కొన్నిసార్లు అందులో తేనె కలుపుకునేవాడిని. ఇక మధ్యాహ్నాం వరకు ఇక ఎలాంటి ఫుడ్ తినేవాడిని కాదు”.

లంచ్ ఎలా ఉండేది

మధ్య్నాహాం సమయంలో ఎలాంటి ఆయిల్ ఫుడ్ తినను. కేవలం ఉడికించినవి మాత్రమే ఆహారంగా తీసుకునేవాడిని. స్వీట్ కార్న్, చెనగలు,బీన్స్,బ్రోకలి,క్యాబేజీ,క్యారెట్ అన్నీ కలిపి 100 లేదా 150 గ్రాములు ఉడికించి వాటిలో కొంచెం పెప్పర్,సాల్ట్ వేసుకొని తినేవాడిని. మధ్నాహ్నాం కనీసం రెండు లీటర్ల వరకు నీళ్లు తాగేవాడిని.

రాత్రికి డిన్నర్ ఎలా

“సాయంత్రం 6 గంటలలోపే డిన్నర్ ముగించేవాడిని. డిన్నర్ లోకి కూడా ఎలాంటి ఆయిల్ ఫుడ్ తీసుకునేవాడిని కాదు. బొబ్బర్లు,పల్లీలు,శెనగలు,రాజ్మ ఉడికించుకొని మొత్తం కలిపి ఓ 50 గ్రాములు తినేవాడిని. కొన్ని సమయాల్లో కేవలం డ్రై ఫ్రూట్స్ మాత్రమే తినేవాడిని. కొన్ని సమయాల్లో కేవలం కీర దోస, క్యారెట్ ముక్కలు,ఉల్లిపాయ,పెరుగు కలిపి తినేవాడిని”

వచ్చిన మార్పులు

కేవలం నెల రోజుల్లోనే 12 కేజీలు తగ్గాను. నా వెయిట్ లాస్ జర్నీలో రోజుకి 5 లీటర్ల నీళ్లు తాగడంతో వల్ల స్కిన్ గ్లో అయింది. డబుల్ ఎక్స్ఎల్ ఉండే షర్ట్ సైజ్ ఎల్ కి వచ్చేసింది. గతంలో కంటే చాలా యాక్టివ్ గా ఉన్నా..ఎలాంటి ఆరోగ్య సమస్యలు కూడా లేవు. దేన్నయినా సాధించవచ్చు అనే ఆత్మవిశ్వాసం నాలో పెరిగింది. గతంలో నాకు బాగా తలనొప్పి ఉండేవి. ఇప్పుడసలు తలనొప్పి లేదు.

చివరిగా బరువు తగ్గాలనుకునేవాళ్లకి మీరేం చెప్తారు

“కేవలం బరువు తగ్గాలి అనుకుంటే సరిపోదు. పట్టుదల, నిబద్దత ఉంటేనే సాధ్యం. వెయిట్ లాస్ కోసం వేల రూపాయలు ఖర్చు పెట్టక్కర్లేదు. మీ రోజువారి ఫుడ్ అలవాట్లలో చిన్న మార్పులు చేసుకుంటే బరువుకి బరువు తగ్గవచ్చు..ఆరోగ్యానికి ఆరోగ్యం పొందవచ్చు”అని విజయేందర్ రెడ్డి తన వెయిట్ లాస్ జర్నీ గురించి తెలిపారు.