Weight Loss Tips: ఉదయం ఈ పొరపాటు చేశారో..పొట్టతోపాటు బరువు పెరగడం ఖాయం.!

www.mannamweb.com


Weight Loss Tips: నేటి బిజీలైఫ్ లో చాలా మందికి తినడానికి సమయం దొరకడం లేదు. ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకునేంత వరకు క్షణం తీరిక లేకుండా గడుపుతున్నవారు ఎంతో మంది ఉన్నారు.

సమయానికి తినకపోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు పలుకరిస్తున్నాయి. శరీరంలో కొవ్వు పెరగడం, పొట్ట, బరువైన శరీరం..ఇలాంటి సమస్యలను లక్షలాది మంది ప్రజలు ఎదుర్కొంటున్నారు. అయితే చాలా మంది సరైన సలహా తీసుకోకుండా, బరువు తగ్గడానికి, స్నేహితులు లేదా ఇంటర్నెట్ నుంచి సమాచారం సేకరించి డైట్ పాటిస్తున్నారు. కానీ ఈ సమస్య మాత్రం పెరుగుతుంది తప్పా తగ్గడం లేదు. ఇంట్లో భోజనం చేసే సమయం లేక బయటి భోజనం తినడం, గంటలతరబడి ఆఫీసుల్లో కూర్చోని పనిచేయడం వంటి అలవాట్లు ఈ సమస్యను మరింత తీవ్రం చేస్తాయి. వీటన్నింటితోపాటు మనం చేసే కొన్ని తప్పులు కూడా బరువు పెరిగేందుకు కారణం అవుతున్నాయి. ఉదయం చేసే కొన్ని తప్పులు బరువు పెరగడానికి కారణం అవుతున్నాయని మీకు తెలుసా?

అల్పాహారం మానేయడం:

ఉదయం సమయం లేకపోవడం వల్లనో..లేదా ఇతర కారణాల వల్లనో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్టు తీసుకోరు. ఇలా చేస్తే బరువు తగ్గుతారని అనుకుంటారు. కానీ ఇది చాలా పెద్ద తప్పని మీకు తెలసా. మీ బరువు పెరగడానికి బ్రేక్ ఫాస్ట్ మానేయడమే ప్రధాన కారణం అంటున్నారు నిపుణులు. బరువు తగ్గాలంటే అల్పాహారం తప్పకుండా తీసుకోవాలని సూచిస్తున్నారు. అల్పాహారం తీసుకోకపోవడం వల్ల మీ జీవక్రియ దెబ్బతింటుంది. మీ శరీరాన్ని తప్పుగా తినేవిధంగా ప్రోత్సహిస్తుంది.

మెటాబాలిజం నెమ్మదిస్తుంది. ఇది మీ బరువును పెంచేలా ప్రోత్సహిస్తుంది. బ్రేక్ ఫాస్ట్ చేయకపోతే మధ్యాహ్నం భోజనం వరకు వేచి ఉండాలి. మధ్యలో ఆకలి వేయడంతో ఏదొకటి తింటుంటారు. ఇలాంటి తప్పులు చేయకూడదు. ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం శరీరానికి అత్యంత ప్రమాదకరమని వైద్యులు చెబుతున్నారు. మీరు కొంత శ్రద్ధ పెట్టి..మీ మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ ను సులభంగా తయారు చేసుకోవచ్చు. ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే మీరు ఓట్స్, బ్రెడ్, గుడ్లు వంటి 5 నిమిషాల్లో రెడీ చేసుకునే బ్రేక్ ఫాస్ట్ రెసీపీలు ఎన్నో ఉన్నాయి. ఇవ్వన్నీ కూడా మీరు ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేసేందుకు అనుకూలంగా ఉంటాయి.

ఇంకొంతమంది అయితే ఉపవాసం ఉంటుంటారు. ఉదయం ఆలస్యంగా మేల్కోవడం లేదంటే బ్రేక్ ఫాస్ట్ మానేయడం వల్ల ఆకలితో ఉంటారు. వాళ్లు సమాయానికి తినకపోవడం పెద్ద తప్పు. ఎందుకంటే సమయంప్రకారం తినాలి. ఉదయం అల్పహారం, మధ్యాహ్నం భోజనం, సాయంత్రం స్నాక్స్ , రాత్రి భోజనం ఇలా సమయానుసారంగా తింటే కేలరీలు కూడా అదుపులో ఉంటాయి. బరువు కూడా అదుపులో ఉంటుంది. జీర్ణక్రియ కూడా సులభతరం చేయడంతోపాటు జీవక్రియను మెరుగుపరుస్తుంది.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.