అద్భుతమైన ట్రిక్.. పిల్లాడు మొబైల్ ఎక్కువగా చూస్తున్నాడని తల్లి ఏం చేసిందంటే..

ప్రస్తుతం మొబైల్ ఫోన్ అందరినీ శాసిస్తోంది. వయసుతో సంబంధం లేకుండా అందరూ మొబైల్‌తో గంటల కొద్దీ సమయం గడుపుతున్నారు. ముఖ్యంగా ఈ తరం తల్లిదండ్రులకు మొబైల్ అనేది పెద్ద సమస్యగా మారింది.


పిల్లలు తినాలన్నా, సైలెంట్‌గా కూర్చోవాలన్నా వారికి మొబైల్ ఇవ్వాల్సిందే. స్కూల్‌లో ఉన్న సమయంలో మినహా వారి చేతిలో మొబైల్ ఉండాల్సిందే. పిల్లలను మొబైల్ ఫోన్‌లకు దూరంగా ఉంచడానికి కొందరు రకరకాల ట్రిక్‌లు ఉపయోగిస్తుంటారు (parenting hack viral video).

ఒక తల్లి తన మూడేళ్ల బిడ్డకు మొబైల్‌ను దూరం చేయడానికి ఎలాంటి ట్రిక్ ఉపయోగించిందో తెలిపే వీడియో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కుర్రాడు పడుక్కున్నప్పుడు అతడి తల్లి అతడి కళ్ల చుట్టూ కాటుక పూసింది. లేచిన తర్వాత అద్దంలో చూసుకోమంది. కళ్ల చుట్టూ నల్లగా ఉండడంతో ఆ కుర్రాడు భయపడ్డాడు. మొబైల్ ఫోన్‌ను చూడటం వల్ల కళ్ల కింద నల్లటి మచ్చలు వస్తాయనే భయాన్ని ఆ కుర్రాడిలో తల్లి కలిగించింది. తన మొహాన్ని చూసి ఆ కుర్రాడు ఏడవడం ప్రారంభించాడు (child mobile addiction).

ఈ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో అది కాస్తా వైరల్‌గా మారింది (hilarious parenting moment). దాదాపు 20 లక్షల మంది ఈ వీడియోను వీక్షించారు. 1.25 లక్షల కంటే ఎక్కువ మంది ఈ వీడియోను లైక్ చేసి తమ స్పందనలను తెలియజేశారు. ఈ మహిళ తన కొడుకుతో చేసినది మొబైల్ చూడటం కంటే ప్రమాదకరమని ఒకరు కామెంట్ చేశారు. పిల్లవాడికి వివరించడానికి ఇది చాలా మంచి మార్గం అని మరొకరు ప్రశంసించారు.

👉 ఈ ఆర్టికల్ ని మీ వాట్సప్ / టెలిగ్రామ్ / పేస్ బుక్ / ట్విట్టర్ లలో షేర్ చేయండి .... థాంక్యూ.