ఆవాల నూనెతో వంట చేస్తే ఏం జరుగుతుందో తెలుసా..

www.mannamweb.com


వాలను పూర్వం నుంచి కూడా ఆహారంలో ఒక భాగం చేశారు. ఆవాలను తినడం వల్ల ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఆవాల పిండితో పులిహార చేసినా, ఆవకాయ పెట్టినా ఆహా ఎంతో అద్భుతంగా ఉంటుంది.

ఆవాలను కేవలం ఆరోగ్యం కోసమే కాకుండా.. చర్మ సంరక్షణకు కూడా ఉపయోగిస్తారు. ఆవాల నుంచి తయారు చేసిన నూనె కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. ఇప్పుడంటే వంట నూనెలో ఎన్నో రకాలు వచ్చాయి. కానీ ఇంతకు ముందు ఎక్కువగా ఆవాల నూనెతో వంటలు తయారు చేసేవారు. ఆవాల నూనె కూడా ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇందులో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి. ఉంటాయి. మరి ఆవాల నూనెతో వంట తయారు చేసి తినడం వల్ల ఎలాంటి ఫలితాలు ఉంటాయో ఇప్పుడు తెలుసుకుందాం.

చెడు కొవ్వును తగ్గిస్తుంది:

ఆవాల నూనెను వంటల్లో ఉపయోగించడం వల్ల చెడు కొవ్వు అనేది తగ్గుతుంది. ఇందులో ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ వంటి మంచి కొవ్వులు ఉంటాయి ఉంటాయి. ఇవి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ లెవల్స్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల గుండె జబ్బులు, అధిక బరువు నుంచి రిలీఫ్ పొందుతారు.

రక్త పోటు కంట్రోల్:

మస్టర్డ్ ఆయిల్‌తో వంటలు చేయడం వల్ల శరీరంలో రక్త పోటు కూడా తగ్గుతుంది. కాబట్టి హైబీపీతో బాధ పడేవారు ఆవ నూనె వంటల్లో ఉపయోగించడం మంచిది. దీని వల్ల గుండె సంబంధిత సమస్యలు కూడా కంట్రోల్ అవుతాయి.

ఫ్రీ రాడికల్స్‌ నశిస్తాయి:

ఆవ నూనెను వంటకు ఉపయోగించడం వల్ల శరీరంలో ఉండే ఫ్రీ రాడికల్స్‌ను నశిస్తాయి. ఆవనూనెలో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఇందుకు సహాయం చేస్తాయి. ఫ్రీ రాడికల్స్.. కణాలకు నష్టాన్ని కలిగించి క్యాన్సర్ కు దారి తీస్తాయి.

రోగ నిరోధక శక్తిని పెరుగుతుంది:

ఆవనూనెతో తయారు చేసిన వంటలు తినడం వల్ల శరీరంలో రోగ నిరోధక శక్తి అనేది పెరుగుతుంది. దీని వల్ల అనారోగ్య సమస్యల బారిన పడకుండా ఉంటారు. ఇన్ ఫెక్షన్లతో పోరాడే శక్తి లభిస్తుంది.

వాపులు, నొప్పులు తగ్గుతాయి:

ఆవనూనెలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులు, వాపులను తగ్గించడంలో సహాయ పడుతుంది. అలాగే చర్మ, జుట్టు సమస్యలు తగ్గి అందంగా కనిపిస్తారు.

(NOTE: ఇంటర్నెట్‌లో సేకరించిన సమాచారం ఆధారంగా ఈ వివరాలు మీకు అందించటం జరిగింది. ఇందులోని అంశాలు కేవలం అవగాహన కోసం మాత్రమే.)