చాలామంది పండ్లను ఇష్టంగా తింటారు. ఆరోగ్యంగా ఉండాలనుకునే వారు పండ్లను తినడం మంచిదే అయినప్పటికీ కొన్ని రకాల పండ్లను కలిపి తినడం ప్రమాదమని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బొప్పాయి పండు, అరటిపండు కలిపి తినడం ఏమాత్రం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు.
బొప్పాయి, అరటి పండ్లు కలిపి తింటే ఈ సమస్యలు బొప్పాయి పండు, అరటిపండు విభిన్న స్వభావం కలిగిన పండ్లని అందుకే వీటిని కలిపి తినడం ఏమాత్రం మంచిది కాదని వైద్యులు చెబుతున్నారు. బొప్పాయి పండు, అరటిపండు కలిపి తింటే అనేక అనారోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా ఈ రెండు పండ్లను కలిపి తినడం వల్ల అజీర్ణం సమస్య వస్తుందని, వాంతులు, అలర్జీల వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉందని చెబుతున్నారు.
బొప్పాయి, అరటి కలిపి తింటే శ్వాసకోశ సమస్యలు ఇక శ్వాసకోశ సమస్యలు ఉన్నవారు ఈ రెండు పండ్లను కలిపి తినడం మంచిది కాదని హెచ్చరిస్తున్నారు. అరటిపండు, బొప్పాయి పండు కలిపి తినడం వల్ల ఆస్తమాతో పాటు ఇతర శ్వాసకోశ సమస్యలు వస్తాయని, ఇబ్బంది పడాల్సి ఉంటుందని చెబుతున్నారు. ఇక ఆయుర్వేదం ప్రకారం అరటిపండు శరీరాన్ని చల్లబరుస్తుంది.
బొప్పాయి శరీరాన్ని వేడి చేస్తుంది. రెండు భిన్న స్వభావాలు కలిగిన ఈ రెండు పండ్లను తినడం మంచిది కాదు. ఈ సమస్యలు కూడా వచ్చే అవకాశం ఒకవేళ ఎవరైనా ఈ రెండింటినీ కలిపి తింటే జీర్ణవ్యవస్థ పాడవుతుంది. ఈ రెండు పండ్లను కలిపి తినడం వల్ల తలనొప్పి వస్తుంది. కళ్ళు తిరగడం కూడా జరుగుతుంది. అయితే బొప్పాయి పండులోను, అరటి పండులోను మన ఆరోగ్యానికి దోహదం చేసే ఎన్నో గుణాలు ఉంటాయి. వీటిని విడివిడిగా తింటే ఆ ప్రయోజనాలు మనకు చేకూరుతాయి.
బొప్పాయి, అరటి విడిగా తింటే మంచిది అందుకే బొప్పాయి పండును, అరటి పండును విడివిడిగా తింటే మంచిదని చెబుతున్నారు. విడివిడిగా వీటిని తినటం కారణంగా ఈ పండ్లలో ఉండే పోషకాలు మనకు ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తాయి. అరటిపండులో క్యాల్షియం, పొటాషియం, ఫైబరం ప్రోటీన్, కార్బోహైడ్రేట్స్ ఉంటాయి. ఇక బొప్పాయిలో విటమిన్లు ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ లతోపాటు అనేక బి కాంప్లెక్స్ విటమిన్లు ఉంటాయి. ఇవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
disclaimer: ఈ కథనం వైద్య నిపుణుల సూచనలు మరియు ఇంటర్నెట్‌లో అందుబాటులో ఉన్న అంశాల ఆధారంగా రూపొందించబడింది.