మనం తీసుకునే ఆహారంపైనే మన మన ఆరోగ్యం ఆధారపడి ఉందుంటదని తెలిసిందే. మంచి ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంమెరుగువుతుంది. అయితే ఇంతకీ మంచి ఆరోగ్యాన్ని ఎలా నిర్వచిస్తారనే సందేహం రావడం సర్వసాధారణం.
ఇందులో భాగంగానే ప్రపంచ ఆరోగ్య సంస్థ హెల్త్ డైట్‌కు సంబంధించి ఒక డైట్ చార్ట్ విడుదల చేసింది. దీనిబట్టి మంచి ఆహారం అంటే ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..
ప్రపంచ ఆరోగ్య సంస్థ విడుదల జారీ చేసిన మార్గదర్శకాల ఆధారంగా తీసుకునే ఆహారంలో పండ్లు, కూరగాయలు, పప్పులు ఎక్కువగా ఉండాలని చెబుతున్నారు. కచ్చితంగా ప్రతీరోజూ ఆహారంలో ఆకు కూరలు ఉండాలని సూచిస్తున్నారు. ఇక వీటితో పాటు సీజనల్ ఫ్రూట్స్‌ను కచ్చితంగా ఆహారంలో భాగం చేసుకోవాలని సూచిస్తున్నారు. అలాగే ఉప్పు విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని చెబుతున్నారు. రోజు మొత్తంగా ఒక చెంచాను మించి ఉప్పు తీసుకోవద్దని అంటున్నారు. అలాగే ఆహారంలో ట్రాన్స్ ఫ్యాట్స్ తీసుకోవడం మానేయాలి. మాంసం, కాల్చిన, వేయించిన ఆహారాలకు దూరంగా ఉండాలి.
ఇక తీసుకునే ఆహారంలో వేయించిన ఆహారాన్ని ఎక్కువగా తీసుకోకూడదు. దీనివల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. వెన్న, నెయ్యికి బదులుగా, పాలీసాచురేటెడ్ కొవ్వులు ఉన్న నూనెను ఉపయోగించాలి. సోయాబీన్, కనోలా, మొక్కజొన్న, పొద్దుతిరుగుడు నూనె వంటివి వాటిని ఆహారంలో భాగం చేసుకోవాలి. అధిక చక్కెర మధుమేహం, గుండె జబ్బుల ప్రమాదాన్ని పెంచుతుంది. దీంతో పాటు ఊబకాయం కూడా పెరగడం మొదలవుతుంది. చక్కెర తీసుకోవడం తగ్గించాలి. ఇందుకోసం కార్బోనేటేడ్ డ్రింక్స్, స్పోర్ట్స్ డ్రింక్స్, రెడీ టు డ్రింక్ టీ, ఫ్లేవర్డ్ మిల్క్ వంటి వాటికి దూరంగా ఉండాలి.
ఇక తీసుకునే ఆహారంలో ధాన్యాలు, మిల్లెట్లు ఉండేలా చూసుకోవాలి. పప్పులు, మాంసం ఆహారాలు, గుడ్లు, డ్రై ఫ్రూట్స్, నూనె గింజలు, పెరుగు ఉండాలి. తీసుకునే ఆహారంలో 45 శాతం వరకు గింజలు ఉండాలి. అయితే పప్పులు, గుడ్లు, మాంసం ఆహారాలు 14 నుంచి 15 శాతం ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. అయితే గింజలు, నూనెగింజలు, పాలు, పాల ఉత్పత్తులు రోజుకు మొత్తం శక్తిలో 8-10% ఉండాలి. మీ రోజువారీ ఆహారంలో చక్కెర, ఉప్పు, కొవ్వును తగ్గించడానికి పండ్లతో పాటు.. కూరగాయలను ఎక్కువగా తినాలి. ముఖ్యంగా గర్భిణులు, పాలిచ్చే మహిళలు వీలైనంత ఎక్కువ పాలు, గుడ్లు, మాంసం తినాలని సూచించారు.