ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం విడాకుల సంఖ్య పెరుగుతూనే ఉంది. విడాకులకు ప్రధాన కారణం చాలానే ఉంటాయి. అందులో ఒకటి వివాహేతర సంబంధాలు. గత దశాబ్దంలో ఇవి వేగంగా పెరుగుతున్నాయి.
ఆన్‌లైన్ డేటింగ్ సైట్‌ల విస్తరణ, లైంగికత పట్ల వైఖరులు మారడంతో వివాహేతర సంబంధాలు ఇప్పుడు సర్వసాధారణంగా మారాయి.
ఈ వివాహేతర సంబంధాలు కేవలం ఒక్క దేశంలోనే కాదు, ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఈ సంబంధాలు ఉన్నాయి. దీని కారణంగా కుటుంబాలకు కుటుంబాలే విచ్చిన్నమవుతున్నాయి. అయితే లెక్కల ప్రకారం ఏ దేశంలో ఎక్కువగా వివాహేతర సంబంధాలు ఉన్నాయి? అందులో భారతదేశం సంఖ్య ఎంత అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అత్యధికంగా వివాహేతర సంబంధాలు ఉన్న దేశం
ప్రపంచంలో ఏ దేశంలో వివాహేతర సంబంధాలు ఎక్కువగా ఉన్నాయో మీరు ఎప్పుడైనా ఆలోచించారా? ఈ ప్రశ్నకు మనం సాధారణంగా అమెరికా లేదా మరేదైనా యూరోపియన్ దేశం అని సమాధానం చెప్తాము. కానీ అది పూర్తిగా తప్పు. అత్యధిక వివాహిత సంబంధాలు ఉన్నది ఓ ఆసియా దేశంలో. అదే థాయిలాండ్.
వరల్డ్ పాపులేషన్ రివ్యూ ప్రకారం, థాయిలాండ్‌లో 51 శాతం మంది వివాహేతర సంబంధంలో పాల్గొంటున్నారు. థాయిలాండ్‌లో వివిధ రకాల అవిశ్వాస పద్ధతులు ఉన్నాయి. వాటిలో మియా నోయి అనే సాంప్రదాయం కూడా ఉంది. దీని ప్రకారం అక్కడి యువత సాధారణ హుక్అప్ సంస్కృతిలో పాల్గొంటున్నారు. ఇక్కడి పురుషులు, మహిళలు తమ ప్రాథమిక సంబంధాలతో పాటు బాహ్య సంబంధాన్ని కలిగి ఉండటం సాధారణమని భావిస్తారు. ఈ సంబంధాలన్నీ లైంగిక కార్యకలాపాలతో ముడిపడి ఉండవు.
వివాహేతర సంబంధాలు అత్యధికంగా ఉన్న రెండవ దేశం డెన్మార్క్, ఈ దేశంలో 46% మంది వివాహేతర సంబంధాలలో పాల్గొంటున్నారు. అలాగే ఆశ్చర్యకరంగా అత్యధిక వివాహేతర సంబంధాలు కలిగి ఉన్న దేశాల జాబితాలో జర్మనీ మూడవ స్థానంలో ఉంది. జర్మనీలో, దాదాపు 45 శాతం మంది ఈ సంబంధాలు కలిగి ఉన్నారు.
నాల్గవ స్థానంలో ఇటలీ ఉంది. ఇక్కడ దాదాపు 45 శాతం మంది వివాహేతర సంబంధాలలో పాల్గొంటారు. ఐదవ స్థానంలో ఉన్న ఫ్రాన్స్‌లో, దాదాపు 43 శాతం మందికి వివాహేతర సంబంధం ఉంది. నార్వేలో 41 శాతం కంటే ఎక్కువ మందికి ఒకటి కంటే ఎక్కువ సంబంధాలు ఉన్నాయి. బెల్జియం కూడా ఈ జాబితాలో ఉంది. అక్కడ 40 శాతం మందికి వివాహేతర సంబంధాలు ఉన్నాయి. స్పెయిన్‌లో 39 శాతం, యునైటెడ్ కింగ్‌డమ్‌లో 36 శాతం, కెనడాలో 36 శాతం మంది వివాహేతర సంబంధాలు కలిగి ఉన్నారు. ఈ జాబితాలో భారత్ లేకపోవడం గమనార్హం.
































