ప్రస్తుతం క్రిప్టో కరెన్సీ మార్కెట్లో బిట్ కాయిన్ అనేది చరిత్రలోనే తొలిసారిగా ఎవరూ ఊహించని 1 లక్ష డాలర్లు దాటేసింది. అయితే ఈ నేపథ్యంలో మన దేశీయ మార్కెట్లో ప్రస్తుతం జియో కాయిన్ కూడా ట్రెండింగ్ అవుతుంది.
నిజానికి ఏది క్రిప్టో కరెన్సీ కాకపోయినప్పటికీ, మార్కెట్లో మాత్రం దీని బజ్ గట్టిగా వినిపిస్తోంది. జియో కాయిన్ 21 మే 2025 నాటికి, ఒక్కో నాణెం రూ. 26.88 వద్ద ట్రేడవుతోంది, దీని మార్కెట్ క్యాపిటలైజేషన్ రూ. 4.72 కోట్లు అని వాలెట్ ఇన్వెస్టర్ తెలిపింది. ముఖేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండస్ట్రీస్ టెక్ విభాగం అయిన జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ (JPL) ద్వారా ఈ కాయిన్ సృష్టించారు. పాలిగాన్ ల్యాబ్స్ భాగస్వామ్యంతో ఈ టోకెన్ తయారు చేసారు.రిలయన్స్ తెలిసిన సమాచారం ప్రకారం, జియోకాయిన్స్ అనేది బ్లాక్‌చెయిన్ ఆధారిత రివార్డ్ టోకెన్‌లు, వీటిని వినియోగదారులు జియో ప్లాట్‌ఫామ్స్ లిమిటెడ్ వారి భారతీయ మొబైల్ నంబర్‌లను ఉపయోగించి వివిధ మొబైల్ లేదా ఇంటర్నెట్ ఆధారిత యాప్‌లతో ఉపయోగించడం ద్వారా ద్వారా సంపాదించవచ్చని తెలిపింది. అధికారికంగా జియో కాయిన్ ఒక క్రిప్టోకరెన్సీ కాదు. ప్రస్తుతం జియో కాయిన్ ను యూజర్లకు రివార్డ్ కోసం అందిస్తున్నారు. దీన్ని జియోస్పియర్ , జియోమార్ట్, జియో సినిమా, మై జియో యాప్స్ లో రివార్డ్ పాయింట్లుగా ఉపయోగిస్తున్నారు. ప్రస్తుత జియో కాయిన్ విలువ రూ.26.886124గా ఉండగా, మొత్తం 19,08,130 టోకెన్లు చెలామణిలో ఉన్నాయి. ఇది మే 16, 2025న రూ. 26.026066 వద్ద స్వల్ప పెరుగుదలను సూచిస్తుంది. అయితే, 24-గంటల ట్రేడింగ్ వాల్యూమ్ డేటా అందుబాటులో లేదు. జియో కాయిన్ ఏదైనా ఓపెన్ క్రిప్టోకరెన్సీ ఎక్స్ఛేంజ్‌లో ట్రేడ్ అవుతుందా లేదా అనేది రిలయన్స్ వద్ద నుంచి ఎలాంటి సమాచారం లేదు. జియో కాయిన్ లను ఎలా కలెక్ట్ చేయాలి..>> ముందుగా JioSphere బ్రౌజర్‌ను డౌన్‌లోడ్ చేసి ఇన్‌స్టాల్ చేయండి.>> ఇండియన్ జియో మొబైల్ నంబర్ ఉపయోగించి సైన్ ఇన్ చేయండి.>> ఇదే యాప్‌లో జియో కాయిన్ వాలెట్‌ని యాక్సెస్ చేయండి.>> జియో కాయిన్లను రివార్డులను సేకరించడానికి JioMartలో షాపింగ్ చేయడం లేదా JioCinemaలో కంటెంట్ చూడటం వంటి Jio సేవలను వినియోగించుకోవాలి. >> Android, iOS, Windows, macOS అన్ని రకాల ఓఎస్ లకు చెందిన యూజర్లకు ఈ సర్వీస్ అందుబాటులో ఉంది. అన్ని రకాల మొబైల్ ఫోన్లను ఉపయోగించి ఈ టోకెన్లను పొందవచ్చు. >> జియో కాయిన్లను మొబైల్ రీఛార్జ్‌లు, షాపింగ్ డిస్కౌంట్లు, ప్రత్యేక ఆఫర్‌ల కోసం రీడీమ్ చేసుకోవచ్చు. అయితే వీటి కచ్చితమైన ఉపయోగాలను JPL అధికారికంగా ధృవీకరించలేదు. Disclaimer: పై కథనం సమాచారం కోసం మాత్రమే , ఏ విధంగానూ పెట్టుబడి లేదా వ్యాపార సలహాగా భావించకూడదు. స్టాక్ మార్కెట్లు, మ్యూచువల్ ఫండ్స్, క్రిప్టో కరెన్సీ, ఇతర పెట్టుబడి సాధనాలు లాభనష్టాలతో కూడుకున్నవి.
































