రెడ్‌లైట్ థెరపీ అంటే ఏంటి.? దీని ఉపయోగాలు ఏంటంటే.

www.mannamweb.com


చర్మాన్ని రక్షించుకునేందుకు ఎన్నో రకాల మార్గాలు ఉంటాయి. అందంగా కనిపించాలని ప్రతీ ఒక్కరూ కోరుకుంటారు. అందుకోసం రకరకాల మార్గాలను అన్వేషిస్తుంటారు.

కొందరు మేకప్‌ వేసుకుంటే మరికొందరు ఇతర మార్గాలను వెతుక్కుంటారు. అయితే కొందరు సినీ తారలు రెడ్‌ లైట్ థెరపీని అనుసరిస్తుంటారు. ఇంతకీ రెడ్‌ లైట్ థెరపీ అంటే ఏంటి.? దీనివల్ల చర్మానికి జరిగే లాభాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం..

రెడ్‌ లైట్‌ను ఉపయోగించి చర్మం సౌందర్యాన్ని మెరుపరుస్తారు. ఎరుపు కాంతితో కూడిన తక్కువ-స్థాయి వేవ్స్‌ను ఉపయోగించి చికిత్స చేస్తారు. దీనిని లోలెవల్ లైట్ థెరపీ (LLLT) లేదా ఫోటోబయోమోడ్యులేషన్ అని అంటారు. రెడ్‌లైట్ థెరపీ ద్వారా శరీర సౌందర్యాన్ని పెంపొందించేందుకు ఉపయోగిస్తారు. ఈ చికిత్స ద్వారా శరీర సౌందర్యాన్ని మెరుగుపరుస్తారు. గాయాలు మానడానికి, అలాగే చర్మం ముడతలు, మచ్చలు, గీతలు తొలగించడానికి ఈ విధానం ఉపయోగపడుతుంది.

ముఖ్యంగా వృద్ధాప్యంతో చర్మ సంబంధిత సమస్యలన్నింటినీ ఈ థెరపీ ద్వారా నయం చేస్తారు. ఈ థెరపీతో కొత్త చర్మ కణాలను పునరుత్పత్తి చేయడంలో సహాయపడుతుంది. మొటిమలు, చర్మ క్యాన్సర్‌కు చికిత్సకు కూడా ఉపయోగిస్తుంటారు. రెడ్‌ లైట్ ధెరపీ ద్వారా కొల్లాజెన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. వయస్సు పెరుగుతున్న కొద్దీ కొల్లాజెన్ పరిమాణం తగ్గుతుంది. అందువల్ల చర్మంపై వృద్ధాప్య ఛాయలు కనిపిస్తాయి.

ఇక విధానం ద్వారా కెరాటినోజెనిస్ను తగ్గించుకోవచ్చు. ఇది మొటిమలు త్వరగా తగ్గడానికి ఉపయోగపడుతుంది. రెడ్ లైట్ యాంటీ ఏజింగ్ ఎఫెక్ట్స్ తగ్గిస్తుంది. ఫైబ్రోబ్లాస్ట్​ల ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. దీంతో చర్మంపై వచ్చే ముడతలను తగ్గించుకోవచ్చు. ప్రస్తుతం చాలా పట్టణాల్లో ఈ విధానం అందుబాటులోకి వచ్చింది. ఏరియా బట్టి ఛార్జీలు వసూలు చేస్తున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఈ చికిత్స చేయించుకునే ముందు వైద్యుల సలహాలు, సూచనలు పాటించడమే ఉత్తమం.