వీధి పోటు అంటే ఏంటి.? ఏ దిశలో ఉంటే డేంజర్‌

www.mannamweb.com


వాస్తు గురించి అవగాహన ఉన్న ప్రతీ ఒక్కరికీ వీధిపోటు గురించి తెలిసే ఉంటుంది. అందుకే ఇంటిని లేదా స్థలాన్ని కొనుగోలు చేసే ముందు వీధిపోటు ఉందో, లేదో అన్న విషయాన్ని పరిగణలోకి తీసుకుంటారు.

ఇంటి ఎదురుగా ఏదైనా వీధి ఉంటే దానిని వీధిపోటుగా చెబుతుంటారు. అయితే కొన్ని రకాల వీధిపోట్ల కారణంగా ఇబ్బందికర సమస్యలు ఎదుర్కునే అవకాశాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఏ దిశలో వీధిపోటు ఉంటే మంచిది కాదో ఇప్పుడు తెలుసుకుందాం..

కొన్ని రకాల వీధిపోట్ల కారణంగా ఇంట్లో ఆర్థికపరమైన ఇబ్బందులు ఏర్పడితే. మరికొన్ని రకాల వీధిపోట్లతో ఆరోగ్యపరమైన ఇబ్బందులు తలెత్తుతాయి. కొన్ని రకాల వీధిపోట్ల వల్ల కలిగే ఇబ్బందులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. ఒకవేళ దక్షిణ నైరుతీ వీధిపోటు ఉండడం వల్ల ఇల్లాలికి అనారోగ్య ఏర్పడే సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.

ఇక దక్షిణ నైరుతి వీధి పోటు ఉంటే ఇల్లాలు అనారోగ్యం బారినపడే అవకాశం ఉందని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఈ వాస్తు లోపం కారణంగా దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వెంటాడే అవకాశాలు ఉంటాయని అంటున్నారు. దక్షిణ నైరుతి వీధిపోటు వల్ల కుటుంబంలో ఎప్పుడూ సంతోషం ఉండదని, విపరీతమైన ధన వ్యయం అవుతుందని నిపుణులు అంటున్నారు.

ఒకవేళ దక్షిణ మధ్య వీధిపోటు ఉంటే మాత్రం చాలా డేంజర్‌ అని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి వీధి పోటు ఉన్న ఇంట్లో ఉండే వారికి మరణం సంభవించే అవకాశం ఉందని అంటున్నారు. అలాగే దక్షిణ మధ్య వీధిపోటు వల్ల కోర్టుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి కూడా రావచ్చని చెబుతున్నారు.

నోట్‌: పైన తెలిపిన విషయాలు కేవలం పలువురు వాస్తు పండితులు, వాస్తు శాస్త్రంలో తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్‌ గమనించాలి.