ఈ రోజు ప్రధాని నరేంద్ర మోదీ 75వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ వయసులో కూడా పాతికేళ్ల యువకుడిలా ఎంతో ఉత్సాహాంగా ఉంటున్నారు.
ప్రతి రోజు శాఖాహారమే తీసుకుంటారు. ప్రతి నిత్యం క్రమం తప్పకుండా యోగా చేయడంతో పాటు శాఖాహారాల్లో ముఖ్యంగా రోజు పచ్చి కూరగాయాలు.. ఆకుకూరలు తీసుకోవడమే ఆయన ఫిట్ నెస్ సీక్రెట్ రహస్యం. గత 24 యేళ్లుగా ముఖ్యమంత్రిగా ప్రధానమంత్రిగా భాద్యతలు నిర్వహిస్తూన్న ఈయన ఒక్కరోజు కూడా హాస్పిటల్ బెడ్ పై ఉన్న దాఖలాలు లేవు.
ప్రధానమంత్రి మోదీ శాఖాహార జీవనశైలి భారతదేశ వారసత్వం, సంస్కృతికి ప్రతీక. ఆయన భోజనంలో అన్ని ముఖ్యమైన పోషకాలు సమతుల్యంగా ఉంటాయి. ఇది మన దైనందిన జీవితంలో అధిక శక్తి, క్రమశిక్షణ కూడా ఓ కారణం అని చెప్పాలి.
ముఖ్యంగా ప్రధాని మంత్రి ప్రతి రోజు ఆహారంలో పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, చిక్కుళ్ళు, గింజలు, విత్తనాలు వంటి మొక్క ఆధారిత ఆహార పదార్ధలు తీసుకుంటారు. మాంసం, పౌల్ట్రీ సంబంధించిన ఆహారాలకు దూరంగా ఉంటారు.
కొంతమంది శాఖాహారులు పనీర్, పెరుగు వంటి పాల ఉత్పత్తులను తీసుకుంటుండగా, మరికొందరు వాటిని తినరు. ప్రధాని మోదీ ఎల్లప్పుడూ తేలికపాటి, ఇంట్లో వండిన శాఖాహార ఆహారాన్ని తీసుకుంటారు.
మెరుగైన గుండె ఆరోగ్యం.. అన్ని శాఖాహార ఆహార పదార్థాలలో ఫైబర్, పోషకాలు పుష్కలంగా ఉంటాయి. సంతృప్త కొవ్వులు తక్కువగా ఉంటాయి. ఇది గుండె జబ్బుల ప్రమాద తీవ్రతను తగ్గిస్తుంది. గుండె పనితీరును మెరుగుపరుస్తుంది.
రోగనిరోధక శక్తిని పెంచుతుంది.. శాఖాహార ఆహారాలలో శరీర పనితీరుకు ముఖ్యమైన విటమిన్లు, ఖనిజాలు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. అవి మన రోగనిరోధక శక్తిని పెంచుతుతాయి.
బరువు నియంత్రణలో ఉంటుంది.. మాంసాహార ఆహారంతో పోలిస్తే, శాఖాహార భోజనంలో కేలరీలు తక్కువగా ఉంటాయి. ఎక్కువ బరువు పెరగకుండా ఉండటంలో దోహదం చేస్తోంది.
దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.. ప్రతి రోజు శాఖాహార భోజనం తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. వీటిలో మధుమేహం, రక్తపోటు, గుండె జబ్బుల ఇతర దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదం బారిన పడకుండా చేస్తోంది.
జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.. శాఖాహార భోజనం తేలికైనది, ఇది మన జీర్ణ వ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది. మలబద్ధకాన్ని నివారిస్తోంది. అంతేకాదు ప్రతి దసరా శరన్నవరాత్రి సమయంలో ఉపవాసం నుండి ప్రపంచ పర్యటనల సమయంలో సాధారణ శాఖాహార భోజనం తింటూ మన సంస్కృతి సాంప్రదాయలను పాటిస్తున్న ఏకైక ప్రధాని కూడా ఈయనే. శాఖాహార జీవనశైలి వలన రోజంతా యాక్టివ్ ఉండటం.. దీర్ఘకాలంలో ఈ తరహా ఆహారం తీసుకోవడం వల్ల ఆరోగ్యంగా ఉండగలుగుతారు.
































